తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..
శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో స్వామివారి దర్శనానికి ఎక్కువ మంది భక్తులను అనుమతించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు.
భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బందు పడ్డారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కరోనా కూడా తగ్గుముఖం పడుతోందని అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుటామని..సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్ లోనా..లేదా ఆఫ్ లైనా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ తెలిపారు.
శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను గోవింద యాప్ లో ప్రస్తుతం అమ్ముతుండగా.. ఈ టికెట్లను టీటీడీ వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.