సంప్రదాయ భోజనంపై వెనక్కి తగ్గిన టీటీడీ

సంప్రదాయ భోజనంపై వెనక్కి తగ్గిన టీటీడీ
తిరుమలలో శ్రీవారి భక్తులకు దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్ఫాహరం, భోజనం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టిటిడి భక్తులకు అందించాలని సంకల్పించింది. అయితే సాంప్రదాయ భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని సెప్టెంబర్ 8 నుంచి భక్తులకు అందించాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గిన టిటిడి. సోషల్ మీడియా వేదికగా భోజనానికి ఎంత ఖర్చుఅయితే అంత ఖర్చు చెల్లిస్తామని.. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై వెనక్కి తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఈ నిర్ణయం పాలకమండలి లేనప్పుడు తీసుకున్నారని.. దీనిపై అధికారులతో చర్చించామని..స్వామి వారి ప్రసాదంగానే భోజనం అందిస్తామని.. అన్న ప్రసాదాలకు ఏమాత్రం డబ్బులు తీసుకోమని తెలిపారు.