ఈనెల 25 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు

ఈనెల 25 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించాలని ఛైర్మన్ తెలిపారు.

ఈనెల 25 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టోకెన్లు నిలిపివేస్తున్నామని తెలిపారు. 24 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *