TTD: స్వామివారి ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

TTD: స్వామివారి ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల తిరుమలేశ్వరుని దర్శించుకునేందుకు టీటీడీ దర్శన టికెట్లను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. ఈ tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో గాని, లేదా గోవిందా యాప్ల ద్వారా టికెట్లు భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ ఆన్లైన్ 8వేల టికెట్లను అందుబాటులో ఉంచారు. భక్తులు కొవిడ్ నియమాలను పాటిస్తూ తిరుమల తిరుమలేశ్వరుని దర్శించుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.