టక్ జగదీష్ పై క్లారిటీ ఇచ్చిన నాని

టక్ జగదీష్ పై క్లారిటీ ఇచ్చిన నాని

టక్ జగదీష్ పై క్లారిటీ ఇచ్చిన నాని

నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌‌’. డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘టక్‌ జగదీష్‌‌’. ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. కరోనా కారణంగా ఈ సినిమాపై క్లారిటీ లేదు..పైగా థియేటర్లు బంద్ తో సినిమాను ఓటీటీలోనా లేక, థియేటర్లలో విడుదల చేయాలన్న దానిపై క్లారిటీ రాలేదు. సో దీంతో సినిమా రిలీజ్ కు ఆలస్యమైంది. తాజాగా దీనిపై నేచరల్ స్టార్ నాని స్పష్టత ఇచ్చారు. ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. తాను థియేటర్‌కు పెద్ద ఫ్యాన్‌ అని, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని హీరో నాని అన్నారు. ఈ మేరకు నాని ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లలో చిన్న చిత్రాలతో పాటుగా పెద్ద చిత్రాలు కూడా సినిమాలు విడుదలవుతున్నా, పూర్తి స్థాయిలో ఇరురాష్ట్రాల్లో తెరుచుకోని కారణంగా ‘టక్‌జగదీష్‌’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్‌ సాహు గారపాటి, హారీష్ పెద్ది భావించారు. అయితే సినిమా విడుదలపై నిర్మాతలు కొంత ఒత్తిడికి గురిఅవుతున్నారని.. సో నేను వారి అభిప్రాయాలను గౌరవించడమే నేను ఏకీభవిస్తానని చెప్పారు. అమెజాన్‌ ప్రైమ్‌ తో మేకర్స్ ఈ సినిమాను విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసిందని అన్నారు. అయితే త్వరలో ఈ సినిమా ఓటీటీ సాక్షిగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

విడుదల తేదీ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. రెండో హీరోయిన్ గా ఐశ్వరాజేష్, నాజర్, రోహిణి,నరేష్, రావు రమేష్ తదితరులు తమదైన శైలిలో హాస్యాన్ని అందించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించారు.

ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా అందరి మనల్ని పొందుతుందని చిత్రయూనిట్ అంటోంది. కరోనా కారణంగా గతేడాది నాని నటించిన ‘వి’ చిత్రం కూడా ఓటీటీలో రావడం ప్రేక్షుకుల్ని కొంత నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. నానికి నిన్నుకోరి మంచి హిట్ సినిమాను శివ నిర్వాహణ మరోసారి నానికి హిట్ ఇస్తారని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *