ఆ సినిమాకు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు

ఆ సినిమాకు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు

టక్ జగదీష్  సినిమాకు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. డైరెక్టర్ శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో మరో సినిమా.. కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. నానితో శివ నిర్వాహణ ‘నిన్నుకొరి’ చిత్రం హిట్ అయిన విషయం సంగతి అందరికీ తెలిసిందే..టక్ జగదీష్ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించారు. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నరేశ్, రావు రమేశ్ పాత్ర ప్రేక్షకులనీ కడుపుబ్బా నవ్విస్తారని వార్తలొస్తున్నాయి.

అయితే తొలుతగా ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేద్దామని అనుకున్నప్పటీకీ.. కొన్ని కారణాల వల్ల ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను రేపు సాయంత్రం 5 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. కాగా… ఈ సినిమా సెప్టెంబర్‌ 10 న ఓటీటీ వేదికగా విడుదల అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: