థియేటర్లలో ‘టక్‌ జగదీశ్‌’ లేనేట్లేనా..?

థియేటర్లలో ‘టక్‌ జగదీశ్‌’ లేనేట్లేనా..?

‘టక్‌ జగదీశ్‌’కు భారీ ఆఫర్‌.. 

 ఓటీటీ ప్లాట్ ఫ్లామ్..? లేకా థియేటర్లా..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 26వ సినిమా “టక్ జగదీష్ “ వరుస హిట్లతో ఒకప్పుడు టాలీవుడ్‌ హిట్ మెషీన్‌గా పేరొందిన నాచురల్ స్టార్ నాని ఈ మధ్య మళ్లీ కాస్త ఢీలా పడ్డారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్‌ యావరేజ్‌గా నిలిచింది. ఓటీటీలో రిలీజ్ “వి” అంత పాపులర్ కాలేదు. అయితే ఈ సినిమా విడుదలపై ఎప్పటి నుంచో సస్పెన్స్ కొనసాగుతోంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయాలని చిత్రయూనిట్ అనుకొందని సమాచారం. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌, థియేటర్ల పున:ప్రారంభ కానీ కారణంగా విడుదలను వాయిదా వేశారు. అయితే నాని అభిమానులు “ టక్ జగదీష్” కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. అయితే సినిమా విడుదలపై వార్తా, మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేస్తారని సమాచారం.

ఇందుకోసం సినిమా యూనిట్ కు అమెజాన్‌ ప్రైమ్‌ భారీగానే డబ్బు ముట్టచెప్పినట్లు వార్తలోస్తున్నాయి. అయితే, ఓటీటీ విడుదల విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

ఈసినిమాను డైరెక్టర్ శివ నిర్వహణతో నాని చేస్తున్న సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివ-నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.

ఫ్యామిలీ ఎంటైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, రెండో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, నాజర్‌, రోహిణి, నరేశ్‌, రావు రమేష్‌ తదితరులు నటించారు.ఈ సినిమాకు మ్యూజిక్  డైరక్టర్ తమన్‌ స్వరాలు అందించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *