ఈ కషాయం తాగితే.. సీజనల్ వ్యాధులకు చెక్

ఈ కషాయం తాగితే.. సీజనల్ వ్యాధులకు చెక్

ఈ కషాయం తాగితే.. సీజనల్ వ్యాధులకు చెక్

వర్షాకాలం వచ్చేసిందండోయో.. వర్షం ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో.. అంతే ప్రమాదకరం కూడా..   ఈ కాలంలో తగినన్నీ జాగ్రత్తలు పాటించకపోతే.. రోగాల బారిన పడకతప్పదండోయో మరీ….అయితే చిన్నపాటి వర్షంలో తడిసినా జలుబు, తుమ్ములు వచ్చేస్తాయి. వీటితో పాటుగా దగ్గులు, జ్వరాలు, వీరేచనాలు..వాంతులు, తలనొప్పితో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామంటే.. సూక్ష్మక్రిములు మనమీద దాడి చేస్తాయి. అందుకే మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రతతో పాటుగా సురక్షిత నీటిని తాగాలని చెబుతుంటారు వైద్యులు.

మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతూ చుట్టు ప్రక్కల వారిని అనారోగ్య సమస్యలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పౌరులుగా మనందరి బాధ్యత.

వైరల్‌ ఫీవర్‌: ఈ వ్యాధి లక్షణం ఎక్కువగా వర్షంలో తడిసినప్పుడు, తడిసిన బట్టల్లో ఉన్నా.. గొంతు నొప్పి, కండరాల నొప్పులు, ఆయాసం, ముక్కుకారడం, వాంతులు, విరోచనాలు, దద్దుర్లు రావచ్చు. వైరల్‌ ఫీవర్‌తో మనలోని రోగ నిరోధక శక్తి నశిస్తుంది.

మలేరియా: మురుగు నిల్వలో ఉంగే నీటిలో ఏర్పడే ఆడ అనోఫెల్స్ దోమ వల్ల వస్తుంది. వర్షంలో బాగా తడిసిన తర్వాత చలిజ్వరం, వణుకు వస్తే మలేరియా అని అనుమానం రావాలి. చలి, జ్వరం, కడుపులో నొప్పి,  చెమటలు పట్టి మళ్లీ జ్వరం వస్తుంటుంది. రక్త పరీక్షల ద్వారా మలేరియా ఉందో లేదో నిర్ధారించు కోవచ్చు. ఉంటే సకాలంలో సరైన వైద్యం చేయించాలి. కాబట్టి ఎక్కడబడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంచుకుండా చూడాలి. అలా చేస్తే దోమ లు పెరిగే అవకాశాల్ని చాలా వరకు తగ్గించినట్లవుతుంది. అ లాగే ఇంటికి మెస్‌లు, మంచాలకు దోమతెరలు, మస్కిటో రి ప్లెంట్‌లు వాడి దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.

డయేరియా: కలుషిత ఆహారం లేదా కలుషిత నీరు వల్ల కలుగుతుంది. లక్షణాలు ఏమిటంటే ఆయాసం, తిమ్మిరులు, వాంతులు, నీరసం, అలసట వస్తుంది.

టైఫాయిడ్: కలుషిత నీరు లేదా ఆహారం వల్ల వస్తోంది, లక్షణాలు తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడతారు

లెప్టోస్పిరోసిస్ వ్యాధి: ఈ వ్యాధి లక్షణాలు శరీరంపై గాయలున్నవారు మురుగు నీటీలో నడిస్తే వస్తుంది. తలనొప్పి, కళ్లనొప్పి, శరీరం బిగుతుగా అనిపించడం ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించొచ్చు.

జాగ్రత్తలు: ఇల్లు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోండి. దోమలు లేకుండా జాగ్రత్త పడండి. మీతో పాటుగా మీ పిల్లల దుస్తులనీ కూడా నిండుగా ఉండేలా దుస్తులు ధరించండి. తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోండి. ఈ వర్షాకాలంలో పచ్చి కూరగాయాలు తినకండి. మరిగించి చల్లార్చిన నీరు మీతో పాటుగా మీ పిల్లలకు త్రాగించండి. శరీరంపై గాయాలుంటే మురుగు నీటిలోకి వెళ్లకండి. పైన పాటించిన సూచనలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

తులసిటీతో ఈ రోగాలకు చెక్ పెట్టొచ్చు

అయితే మన హిందూ సంప్రదాయంలో తులసి చెట్టును దేవతగా పూజిస్తారు. ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు నాటి పూజిస్తుంటారు. మన ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అనేక వ్యాధుల నివారణకు ఈ తులసి చెట్టును ఉపయోగిస్తుంటారు. ఇందులో ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..మారుతున్న కాలానుగుణంగా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. తులసిలోని ఔషదగుణాలు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తాయి.

వర్షాకాలంలో పసుపు, తులసి కషాయాలు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. వర్షాకాలంలో అనేక రోగాలకు చెక్ పెట్టే తులసి పసుపుతో పాటు లవంగాలు, దాల్చిన చెక్క, తేనే, నిమ్మకాయ, లేదా అల్లం కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మరీ మీరే చూడండి.

కావాల్సినవిన పదార్ధాలు: 10-12 తులసి ఆకులు, టేబుల్ స్పూన్ పసుపు, 2-3 స్పూన్ల తేనె, 3-4 లవంగాలు, 1-2 దాల్చిన చెక్కలు ,తయారు చేసే విధానం

ముందుగా ఒక పాత్రలో చెంబుడు నీరు తీసుకుని అందులో ముందుగా శుభ్రం చేసుకున్న తులసి ఆకులు, పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క కలుపుకోవాలి. దానిని 30 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి చల్లార్చిన తర్వాత గోరు వేచ్చగా తాగాలి. ఒకవేళ రుచి నచ్చకపోతే తేనెను కలుపుకోవచ్చు.

ఈ తులసి కషాయం రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా…జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ వ్యాధుల నుంచి నయం చేస్తుంది. ఈ కషాయాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగాలి.ఈ కషాయంతో వర్షకాలంలో వచ్చే వ్యాధులతో పాటు అనేరోగాలకు చెక్ పెట్టొచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *