అమెరికాలో విరుచుకుపడ్డ “ఐదా” తుఫాన్

అమెరికాలో విరుచుకుపడ్డ “ఐదా” తుఫాన్

అమెరికాలో విరుచుకుపడ్డ “ఐదా” తుఫాన్  

అమెరికాలోని లూసియానా, మిసిసిపీ రాష్ట్రాలను ఐదా హరికేన్‌ అక్కడి ప్రజల్ని గడగడ లాడిస్తోంది. ఆ ప్రాంతంలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో భారీ శబ్ధంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇదే ప్రాంతంలో గత 16 ఏళ్ల కిందట కత్రినా హరికేన్‌ తుఫాన్ వచ్చినప్పుడు.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వ్యక్తమవుతోందని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇప్పటికే లూసియానా రాష్ట్రం దక్షిణ తీర ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రతీర, నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తీవ్రత కొనసాగుతుంది. ఇప్పటికే 15మందిపైగా మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ వర్ష భీభత్సంతో టెలికాం వ్యవస్థ, రోడ్లు, రావాణ వ్యవస్థ స్తంభించాయి. అత్యవసర వైద్యం, అగ్నిమాపక, పోలీసు సేవలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబరు 911 కూడా సరిగా పనిచేయలేదు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. రాత్రి న్యూ ఆర్లియన్స్‌ నగరంలోని చాలా ప్రాంతాల ప్రజలు చీకట్లో గడపాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టిన అమెరికా సైన్యం.. తుఫాన్, వరద, అత్యవసర పరిస్థితిపై జోబైడెన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: