నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత

నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత

నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారంనాడు ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య మరణంతో ఉత్తేజ్, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిరంజీవి కాళ్ల పడి కూతురు, ఉత్తేజ్ వెక్కివెక్కి ఏడ్చారు. వాళ్లని చిరంజీవి ఓదార్చే ప్రయత్నం చేసారు. విషయం తెలుసుకున్న నటులు ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఉత్తేజ్ భార్య మరణం పట్ల పలువురు  సంతాపం ప్రకటించారు.

ఉత్తేజ్‌ చేసే ప్రతి సేవా కార్యక్రమాల్లోనూ పద్మావతి చాలా ఉత్తేజంగా పాల్గొనేవారు.ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: