క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా..

క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా..

క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా..  

క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయన చేస్తున్న చిత్రానికి పేరును ఖరారు చేసింది చిత్రయూనిట్. దీనికి “ కొండ పొలం” అనే పేరు పెట్టారు. అయితే వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్రయూనిట్.

అయితే విభిన్న కథాంశంతో వైష్ణవ్ తేజ్ ను క్రిష్ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. గతంలో ఉప్పెన సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్ చిత్రం కాసుల వర్షం కురిపించిందనే చెప్పాలి.. ఈ సినిమాతో అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవ్ తేజ్.

అయితే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. రకుల్ గ్రామీణ యువతి పాత్రలో ఓబులమ్మ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట. హీరో వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ లో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఓ నవల ఆధారంగా క్రిష్ తెరకెక్కించారని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దొళ్ల ఆగడాలను అడ్డుకునే వ్యక్తిగా ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ గ్లింప్స్ లో కనపడుతున్నట్లుగా ఉంది.

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీతి సింగ్, నటిస్తోంది. క్రిష్  డైరెక్షన్ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.అయితే ఈ సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *