మరోసారి పెరగిన గ్యాస్ ధరలు

మరోసారి పెరగిన గ్యాస్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు నెలల గ్యాప్ లో పెరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.75 పెరిగింది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయని చమురు సంస్థలు తెలిపాయి. అయితే ఈసారి 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెరగడం.. వినియోగదారుల నడ్డి విరచడమే. దీని ప్రకారంగా ఆయా రాష్ట్రాల్లో గ్యాస్ పెరుగుదల ఉంటుందని చమురు సంస్థలు తెలిపాయి.