మనం వాడే నూనెల్లో ఏ నూనె వాడితే ఆరోగ్యం..?

మనం వాడే నూనెల్లో ఏ నూనె వాడితే ఆరోగ్యం..?

మనం వాడే నూనెల్లో ఏ నూనె వాడితే ఆరోగ్యం..?

మనం నిత్యం చేసే వంటకాల్లో రకరకాల వంట నూనెలు వాడుతుంటాము..అయితే మనం ఏం నూనె వాడితే మంచిదో అందరికీ ఓ కన్య్ఫూజన్ అనే చెప్పాలి. అయితే వార్త పత్రికలు, మీడియాల్లో ఈ నూనెలు వాడితే మంచిదని తెగ యాడ్స్ ఇస్తూనే ఉంటారు. అవి చూసి మనం ఇంకేమోముంది ఆ నూనె వాడితే మంచిదని అనుకుంటాము. అయితే ఈ నూనెల వాడకంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్యానికి ఏ నూనెలు మంచివో వాటిపై న్యూట్రిషన్ చెప్పిన ప్రకారం మనం తెలుసుకుందాం.

అయితే ఈ నూనెల వాడకంపై న్యూట్రీషనిస్ట్ లు సూచించిన ప్రకారం ఏ నూనెనా మంచిదనే చెప్పాలి. దేనినైనా సరితూకంలో తీసుకుంటే మంచిదని న్యూట్రిషన్లు చెబుతున్నారు. అయితే నూనె వాడకంలో ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా వాడుతుంటారు. సాధరణంగా తెలుగు ప్రజలంతా పల్లినూనె, రిఫండ్ ఆయిల్, నువ్వుల నూనె (గానుగ నూనె) అనేవి వాడుతుంటాము. అయితే ఉత్తరాదిన ఆవాల నూనె, సౌత్ (కేరళ)లో కొబ్బరినూనె వాడుతుంటారు. అయితే ఏ నూనెనా శరీరానికి అవాటు చేస్తే.. అదే విధంగా శరీరం దానికి అలవాటు పడుతుంది. ప్రతి నూనె మంచిదని, చెడ్డదని చెప్పడం సరికాదు. ప్రతి నూనెలోనూ కొవ్వు, మంచి గుణాలుంటాయి. న్యూట్రిషన్లు చెప్పిన ప్రకారం మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (MUFA) ఉండే నూనెల్లో మంచి కొవ్వు ఉంటుందని.. సో దీనిని వాటడం మంచిదని సూచిస్తున్నారు. మానవ శరీరానికి పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFA)లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరానికి అవసరం. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. అయితే మనం వండే వంటకాల్లో రెండు రకాల నూనెలు తీసుకుంటే మంచిదని న్యూట్రిషన్లు అంటున్నారు. అయితే సౌత్ లో ప్రతీ వంటకంలో కొబ్బరినూనెను ఎక్కువగా వాడతారు. అయితే ఇది అన్ని సందర్భాలలో మంచిది కాదు. కొబ్బరి నూనెలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నూనెతో వంట చేసేవాళ్లు రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, పల్లినూనెతో వంటకాలు చేస్తే మంచిది. ఎందుకు వాడాలంటే పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్(PUFA ) అనేది కొబ్బరి నూనెలో ఉండదు.

ఏదీ ఏమైనా ప్రస్తుతం మార్కెట్లో మిక్సిడ్ ఆయిల్స్ కూడా లభిస్తున్నాయి. మన పూర్వీకుల నుంచి మనం పల్లిలనూనె, నూవ్వుల నూనె అనేవి వాడుతున్నాము.. కావున శరీరానికి ఈ నూనెలు వాడితే మంచిదని అంటున్నారు. అయితే వంటకాలు వండేటప్పుడు నెలకొకసారి నూనెలు మార్చి వాడుతుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని అంటున్నారు కొంత మంది న్యూట్రిషిన్లు.  అయితే మన ప్రాచీన కాలం నుంచి మనం పెట్టుకునే ఆవకాయల్లో, పచ్చడ్లలో పల్లినూనె, గానుగ నూనెలు అనేవి వాడుతున్నారు… ఏదీ ఏమైనా నూనెలు వాడకంలో కొంత ఆందోళన అనేది ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *