వరుడు కావలెను టీజర్ విడుదల

వరుడు కావలెను టీజర్ విడుదల

నాగ శౌర్య నటించిన వరుడు కావలెను టీజర్ విడుదల

డైరెక్టర్ లక్ష్మీసౌజన్య నిర్మిస్తున్న ఫ్యామిలీ& లవ్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ చిత్రం టీజర్‌ను విడుదల అయింది. ఈ చిత్రంలో నాగ శౌర్య తో రీతువర్మ కలిసి నటిస్తోంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ అధినేత ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్‌ సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతోంది.

‘‘అమ్మా.. వీళ్లెవరూ నాకు కనెక్ట్‌ కావట్లేదే.. అని రీతువర్మ..

ఆ అందం.. పొగరు అర్డర్‌ ఇచ్చి చేయించినట్లు ఉంటుంది అని నాగశౌర్య

ఏడారిలో ఐస్‌ తయారు చేయడానికి చూస్తున్నాడు…’’

ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ చెప్పిన డైలాగ్‌లు ప్రేక్షకుల్నీ ఎంతో బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందట. ఈ చిత్రాన్నిఅక్టోబర్‌లో థియేటర్‌లలో విడుదల చేద్దామని చిత్రయూనిట్ తెలిపింది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్‌ పాత్ర అధ్బుతంగా ఉందని ప్రేక్షకుల్నీ కడుపుబ్బా నవ్విస్తారని సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *