వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ వరాలు

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ వరాలు

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ వరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రి లోని దళిత వాడల్లో అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ పర్యటించారు. స్థానికంగా ఉన్న దళిత వాడల్లోని 76 దళిత కుటుంబాల ఇండ్లలోకి వెళ్లి  కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలను కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

దళితవాడలో పర్యటించిన సీఎం కేసీఆర్ 

తొలుత దళిత వాడల్లో ఇంటింటికి వెళ్లిన ఇండ్ల పరిస్థితిని పరిశీలించారు. సీఎం ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని దళిత కుటుంబాల ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం గురించి తెలుసా అని అడిగి తెలుసుకున్నారు.

వాసాల మర్రి గ్రామానికి తక్షణమే దళిత బంధు కోసం రూ.7.60 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. దళిత వాడలో పర్యటించిన కేసీఆర్ ఇంటికి దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తే ఏం చేస్తారని అని సీఎం ప్రశ్నించారు..? కొంత మంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని కొందరు ట్రాక్టర్ లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎం కు తెలిపారు.

దళిత వాడల్లో పర్యటించిన సీఎం ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించిన సీఎం నీ మీకు పెన్షన్ వస్తున్నదా అక్కడ అన్న ప్రజానికాన్ని అడిగి తెలుసుకున్నారు.   పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ని ఆదేశించారు.

దళితవాడలో కేసీఆర్ ఇళ్ల  పరిశీలన

దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి సీఎం  చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బంధు డబ్బులు వస్తే వాటిని సరిగా సద్వినియోగం చేసుకోనేలా   మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు.

దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో అధికారులతో కలిసి సీఎం పర్యటించారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని దిగులు చెందొద్దని కేసీఆర్ వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను కేసీఆర్ జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మా ఇండ్లు రోడ్డుకు కిందకు ఉన్నాయి. దీంతో మా ఇండ్లనీ వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

వాసాల మర్రికి డబుల్ బెడ్రూం ఇండ్లు

వాసాల మర్రిలో ప్రతీ ఒక్కరికీ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు.

బీడీ కార్మికులను ఆదుకుంటాం

మాకు పెన్షన్ రావడం లేదని సీఎంకు చెప్పిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ ను సీఎం ఆదే
శించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎం కు విన్నవించగా అల్లుడు డ్రైవర్ గా పని చేస్తాడు అని చెప్పడంతో దళితబందు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

దళిత నాయకుడి ఇంట్లోకి వెళ్లిన కేసీఆర్

ఓ ఇంటి యజమాని మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. పక్కనే వున్న ప్రజా కవి , ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా.. దళిత నాయకుడు ‘‘ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’’ అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు.

పెన్షన్, కరెంట్ రైతు బంధుపై సీఎం ఆరా

దళితవాడలో ప్రతి ఒక్కరిని పెన్షన్, 24 గంటల కరెంట్, సాగు నీళ్ళు వస్తున్నాయా..? రైతు బంధు డబ్బులు వస్తున్నయా ? అడిగితెలసుకున్నారు సీఎం. కేసీఆర్ రైతు బిడ్డ కావడంతో ఏఏ పంటలు సాగు చేస్తున్నారు అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

సర్కార్ భూమి.. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు

ప్రతి దళిత గ్రామంలో సుమారు 100 ఎకరాలకు పైగావున్న సర్కార్ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు.

దళితవాడలోని గ్రామ కాలనీల్లో సుమారు 4 కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించారు. సీఎం వెంట శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తో సహా పలువురు అధికారులు పర్యటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *