వాహనదారులకు గుడ్ న్యూస్..స్టేట్ మారినా.. రీ-రీజిస్ట్రేషన్ అవసరం లేదు

వాహనదారులకు గుడ్ న్యూస్..స్టేట్ మారినా రీ-రీజిస్ట్రేషన్ అవసరం లేదు
వాహనాలు నడిపేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రాష్ట్రం మారినా.. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు ట్రాన్సఫర్ అయినా వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా ‘BH’ (భారత్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసే అవసరం లేకుండా ఉండేందుకు ఈ పథకాన్ని అదుపులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తీసుకొచ్చింది.
వన్ నేషన్… వన్ పర్మిట్.. విధానంలోనే భాగంగా కేంద్రమంత్రిత్వ శాఖ దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇకపై దేశ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ ఒకే సిరీతో ఉండబోతున్నాయి.
అయితే ఈ రీ-రిజిస్ట్రేషన్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రక్షణ మంత్రిత్వశాఖ, సైనిక చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు/ సంస్థల ఉద్యోగులు (ఆయా కంపెనీల ఉద్యోగస్తులు కేంద్ర ప్రాలిత, 4 రాష్ట్రాల్లో సేవలందిస్తుండాలి, లేదా అంతకు మించి సేవలందిస్తుండాలి) ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. BH-Series దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుపడుతుందని కేంద్రం పేర్కొంది.
ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని గరిష్టంగా 15 సంవత్సరాలకు సరిపడా టాక్స్ మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించే వీలుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ రోజుల పాటు అదే చోట వైకిల్ నడపాలంటే వైకిల్ కు ఆ గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాలి. సో.. దీంతో చాలామంది ఉద్యోగులకు ఈ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకే కేంద్రం BH-Series వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.