సభ్యుల తీరుపై ఉపరాష్ట్రపతి కన్నీరు

సభ్యుల తీరుపై ఉపరాష్ట్రపతి కన్నీరు

సభ్యుల తీరుపై ఉపరాష్ట్రపతి కన్నీరు

సభలో సభ్యుల తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. అయితే పార్లమెంటును దేవాలయంగా భావించే అందరూ భావిస్తారు. సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్‌ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ ఉపరాష్ట్రపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీని సందర్భంగా మాట్లాడుతూ సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. కొంతమంది సభ్యులు టేబుల్‌ మీద.. మరికొందరు టేబుల్‌ పైకి ఎక్కి నిరసన తెలిపారు. దీని పట్ల నా ఆవేదన ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.

సభలో వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు అనే అంశం చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి సమయం ఇచ్చినప్పుడు సభలో సభ్యులు వ్యవహరించిన తీరుపై నేను చాలా ఆవేదనకు గురయ్యాను. అయితే గతేడాది తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం పట్ల.. ఇదే క్రమంలో చర్చ జరపకుండా సభ్యులు పదేపదే అంతరాయం సృష్టించారని వెంకయ్య ఆవేదన వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *