వెంకీ, రానాతో వెబ్ సిరీస్

వెంకీ, రానాతో వెబ్ సిరీస్

సినీ ఇండస్ట్రీలో తమదైన శైలిలో ఆ ఇద్దరు మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.. మా అంకుల్ (వెంకటేష్) తో పంచుకోవాలని రానా అన్నారు. వీరిద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారా..చూద్దామని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి గూడ్ న్యూస్ రానే వచ్చింది. మరి వారి కథేంటో చూద్దామా మరీ..

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ బిగ్ న్యూస్..అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. విక్టరీ వెంకటేశ్, రానా కలసి…ఓ వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొనొవాన్‌‌కు రీమేక్‌గా తీయబోతున్నారు. ఈ పాత్రలో వెంకటేష్, రానాలు నటించనున్నారు. ఈ సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్‌‌ను ఖరారు చేశారు.ఈ సిరీస్‌ను డైరెక్టర్లు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మలు డైరెక్షన్ లో వస్తోంది. ఇప్పటివరకు తమ కెరీర్ లో ఎప్పుడూ చేయనటువంటి విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు ఈ సిరీస్‌ గురించి దగ్గుబాటి రానా తెలిపారు. ఈ సీరిస్ తమకు ఛాలెంజింగ్ అని, షూటింగ్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. రానాతో కలిపి పని చేయడానికి..నేను కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాని.. రే డొనొవాన్ సిరీస్‌ కి పెద్ద ఫ్యాన్ అని ఈ అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని విక్టరీ వెంకటేష్ తెలిపారు.

ఇదీ చదవండి డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రెటీస్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *