వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంఛ్

Vespa Scooter: వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంఛ్
వాహనాలు తయారు చేయడంలో కంపెనీ ఎప్పటి నుంచో ఉంది. అయితే పియాజియో సంస్థ పుణెలో 75వ వార్షికోత్సవం నాడు స్పెషల్ ఎడిసన్ వెస్పా స్కూటర్(Vespa scooter )ను లాంచ్ చేసింది. మా కంపెనీ 23 ఏప్రిల్,1946 నాడు స్థాపించబడిందని తెలిపారు. 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ కొత్త వెస్పాను విడుదల చేశామని తెలిపారు.
ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే..రెండు వేరియంట్లలో లభిస్తుంది.. ఈ స్కూటర్ VXL 125 CC, VXL 150 CCలలో అందుబాటులో ఉంచింది కంపెనీ. అయితే ఈ కంపెనీ VXL 125 CC ధర రూ.1.26 లక్షలు, రెండో మోడల్ ధర VXL 150 CC రూ.1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ స్కూటర్‌ను సంస్థ అధికారిక https://www.vespa.com వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎడిషన్ స్కూటర్లను బాగా హైలైట్ చేయడానికి పియాజియో దీనికి గ్లాసీ మెటాలిక్ ఎల్లో,గియాలో కలర్‌ను ఇవ్వడం విశేషం. ఈ స్కూటర్‌కు ముందు, రెండు వైపులా 75 నెంబర్ వైకిల్ పై ముద్రించారు. ఈ స్కూటర్‌తో పాటు వెస్పా కంపెనీ స్కూట్ వెనకభాగాన ఓ ప్రత్యేకమైన వెల్కమ్ కిట్ అందించింది. అయితే ఈ స్కూటర్ లోని వెరియంట్లను చూసి జనం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారట.