నటుడు విజయ్ సేతుపతిపై దాడి..?

బెంగళూరు ఎయిర్ పోర్టులో నటుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిపై ఒక్క సారిగా దాడిజరిగనట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ దాడి విజయసేతుపతిపై కాదని..అతని సెక్యూరిటి సిబ్బందిపై దాడి జరిగిందని విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ ఘటన బెంగళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి.. విజయ్ సేతుపతి పీఏతో గొడవకు దిగారని తెలుస్తోంది. ఆ తరువాత అతను విజయ్ సేతుపతి బృందానికి సారీ చెప్పడంతో వివాదం ముగిసిందని సమాచారం. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయవద్దని విజయ్ సేతుపతి తెలిపినట్లు తెలుస్తోంది. వీడియోలో విజయ్ సేతుపతి, అతని టీమ్ నడుస్తుండగా వెనక నుంచి ఒక వ్యక్తి బలంగా విజయ్ సేతుపతి పీఏని నడుం మీద మోగాలితో గుద్దినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ, పోలీసులు..వెంటనే ఆ దుండగున్ని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 6 సెకన్ల వీడియోలో ఇంతవరకే ఉంది. విజయ్ సేతుపతిని అతడు ఎందుకు వెనుక నుంచి తన్నాడు అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *