1800 మంది పిల్లలకు  నేను చదువు చెప్పిస్తా: విశాల్

ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. ఈ సినిమాలో ఆర్య మరో హీరోగా నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో హీరో యాక్షన్‌ ఆసక్తి అభిమానుల గుండెల్లో ఆశలు రేకిస్తోంది. విశాల్, ఆర్యల ‘ఎనిమి’ సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు, హిందీలో  విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు విజువల్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఎనిమి సినిమా ప్రమోషన్, ప్రిరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా విశాల్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడారు. పునీత్ హఠాన్మరణంతో సినీ ఇండస్ట్రీ ఓ మంచి స్టార్ ని కోల్పోయిందని అన్నారు. పునీత్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని విశాల్ అన్నారు.

తమిళనాట పునీత్ రాజ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సులో స్థిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. పునీత్ నా`కు మంచి మిత్రుడు. ఆయన 1800 మంది పిల్లలకు పైగా ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు అని పునీత్ లేని లోటు చాలా బాధాకరం అని అంటున్నారు.

నా మిత్రుడు చేసిన సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తానని సభాముఖంగా తెలియజేశారు. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను అని హీరో విశాల్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *