విశ్వశాంతి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
విశ్వశాంతి స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆట, పాటలతో సంబరాలు చేసుకున్న విద్యార్థినులు
ప్రకృతి ఆరాధన…ఆధ్యాత్మిక చింతనతోనే బతుకమ్మ వేడుక
విశ్వశాంతిలో సందడిగా విద్యార్థినుల బతుకమ్మ వేడుకలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయం చదువుల నిలయం. ఈ విశ్వ శాంతి చదవుల విద్యాలయంలో చదువుతో పాటుగా ఆట, పాటలతో ముందంజలో ఉంటుంది. ర్యాంకుల విభాగంలో ఈ స్కూల్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. విద్యార్థినులకు బతుకుమ్మను ఎలా పూజించాలో వాళ్ల టీచర్ల ద్వారా ఆటపాటలతో నేర్పారు. తొలిరోజు ఎంగిలి బతుకమ్మ కావడంతో విద్యార్థులంతా తాము తెచ్చిన పూలన్నీ ఒకచోట పేర్చి బతుకమ్మ ఆటపాటలతో ఆడారు విద్యార్థులు.
ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన కలబోతే బతుకమ్మ వేడుక అని, పూలను పూజించే పండుగ..మన తెలంగాణ సంస్కృతి ,సాంప్రదాయాలకు కొలువైన బతుకమ్మ వేడుకలు అని విశ్వశాంతి విద్యాలయం కరస్పాండెంట్ పసుపులేటి నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులతో వివిధ రకాల పూలను సేకరించి వాటిని అందమైన బతుకమ్మలుగా అలంకరించారు. వాటిపై గౌరమ్మను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం వాటి చుట్టూ ప్రదక్షిణగా , లయబద్ధంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు.
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరస్పాడెంట్ నాగేశ్వరరావుగారు మాట్లాడుతూ.. ఈ జగత్తును ఆహ్లాద భరితంగా, నిత్యనూతనంగా తీర్చిదిద్దడానికి పుష్పాలు ఎంతగానో కనువిందు చేస్తాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ ప్రాధాన్యతను.. దాని వెనకాల ఉన్న గాధను గురించి వివరించారు.
మహిషాసురుడితో యుద్దం చేస్తూ.. మహాశక్తి అలసిపోతే ఆమె అలసట తీర్చడానికి మహిళలు పాటలు పాడుతూ కొత్త ఉత్సాహాన్ని అందించారు. ఈ నవ్య శక్తిని అందుకున్న దుర్గాదేవి.. మహిషాసురుని అంతం చేసిందని.. దీంతో సమస్త లోకానికి కొత్త బ్రతుకును ప్రసాదించిందని.. అప్పటి నుంచే ప్రతి ఏడాది మహిళలంతా.. ఆ గౌరమ్మ రూపాన్ని బతుకమ్మగా కొలుచుకుంటన్నారని ఆయన వివరించారు. పండుగలోని సారాంశాన్ని వివరించి అనంతరం నైవేద్యాలు అందరికీ పంచిన విద్యార్థినులు.