ఓటీటీలో ఈనెల 27న వివాహ భోజనంబు

ఓటీటీలో ఈనెల 27న వివాహ భోజనంబు

ఓటీటీలో ఈనెల 27న వివాహ భోజనంబు

ఈనెల 27న ఓటీటీలో “వివాహ భోజనంబు” సినిమా విడుదల కానుంది. రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో రూపొందించిన చిత్రం. ఈ సినిమాను వెంకటాద్రి టాకీస్, ఆనంది ఆర్ట్స్, సోలర్జ్స్ ఫ్యాక్టరీ సమర్పణలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఈ కేఎస్ శినీష్, సందీష్ నిర్మించారు. అయితే ఈసినిమాలో కమెడీయన్ సత్య హీరోగా, హీరోయిన్ గా అర్జావీ రాజ్ నటించింది. అయితే ఈ సినిమాలో సందీష్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.

వివాహభోజనంబు సినిమాలోని అన్ని సీన్స్ ని కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈనెల 27న ఓటీటీ వేదికగా సోనీ ఎలైవీ లో సినిమా రిలీజ్ కానుందని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో శివ, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, వైవా, హర్ష, శివన్నారాయణ, టీఎన్ ఆర్ దంపతులు నటించనున్నారు. ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనివీ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను హాస్యపూరితంగా, కడుపుబ్బా నవ్వించనుందని చిత్రయూనిట్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *