మీకు వాట్సాప్ ఉందా..? యూజర్లకు కొత్త ఫీచర్..!

మీకు వాట్సాప్ ఉందా..? యూజర్లకు కొత్త ఫీచర్..!
సోషల్ మీడియా దిగ్గజాలలో వాట్సాప్ ఒక్కటి. అయితే వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫ్యూచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీనిలో భాగంగా గతంలో ప్రవేశపెట్టిన సీక్రెట్ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో మనం చివరిసారిగా వాట్సాప్ ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే చివరి సీన్ సెట్టింగ్‌లో అప్డేట్ను తీసుకురానుంది. చివరిగా చూసిన సీన్ ఆప్షన్ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఆయా యూజర్ ఎప్పుడు వాడరనే విషయాన్ని అవతలి ఫోన్ కాంటాక్టులకు తెలియజేస్తుంది.
లాస్ట్ సీన్ ఆప్షన్ ఎవరు చూడకుండా ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్‌లో Nobody, Evergreen, మై కాంటాక్ట్స్ అప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్ సీన్ ను వేరే యూజర్లు చూడకుండా మనం తెలియకుండా చేసుకోవచ్చును. తాజాగా వాట్సాప్ లాస్ట్ సీన్ సెట్టింగ్‌లో మరో ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్ సీన్ సెట్టింగ్‌లో భాగంగా My Contact’s Experts ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్’ అనే ఆప్షన్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్ లకు యూజర్ లాస్ట్ సీన్ కన్పించదు.
ప్రస్తుతం ఈ సెట్టింగ్‌ను వాట్సాప్ కేవలం IOS (ఐవోస్) యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని WABETA INFO (డబ్ల్యూఏబెటాఇన్ఫో) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్‌తో కొంతమంది లాస్ట్ సీన్ ఆప్షన్‌ను పూర్తిగా ఆఫ్ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో వాట్సాప్ యూజర్లకు బాగా యూజ్ అవుతుందని అభిప్రాయం.