జుట్లు తెల్లబడుతుంటే ఏం చేయాలి ?

జుట్లు తెల్లబడుతుంటే ఏం చేయాలి ?

సాధారణంగా వయసు మీదపడిన కొద్దీ తెల్ల జుట్టు వస్తుంది. కానీ ఈమధ్యకాలంలో టీనేజ్ వాళ్ళకే జుట్టు తెల్లబడుతోంది. తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా బాధపెట్టే జలుబు, సైనటిస్, మానసిక ఉద్రిక్తతలు (టెన్షన్స్), అలజడి, అశాంతి, కాలుష్యం లాంటి కారణాలు అనేకం జుట్టును తెల్లగా మారుస్తాయి.

నెరిసే జుట్టును ఇలా కాపాడుకోండి

తెల్ల జుట్టును నల్లగా చేసుకోడానికి ఆయుర్వేదంలో ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా మీకు కొన్ని సూచనలు అందిస్తున్నాం. వీటిల్లో ఏ ఒక్క దాన్ని అయినా మీరు పాటించవచ్చు.

1) తిప్పతీగ, ఉసిరి, పల్లేరు కాయ – ఈ మూడింటినీ ఎండబెట్టి, పొడి చేసి, సమాన భాగాలుగా కలపాలి. దీన్ని తేనెతో మూడు పూటలా… పూటకు చెంచాడు చొప్పున సేవించాలి.

2) గుంట గలగరాకు ( రెండు భాగాలు ), నల్ల నువ్వు గింజలు (ఒక భాగం), ఉసిరి కాయలు (ఒక భాగం) – తీసుకొని ఎండ బెట్టి పొడి చేయాలి. చెంచాడు పొడిని ప్రతి రోజూ పటిక బెల్లం (మిస్రీ) కలిపిన పాలతో తీసుకోవాలి

3) ఆయుర్వేద షాపుల్లో భృంగరాజ తైలం అని దొరుకుతుంది. ఈ నూనెను తలకు పట్టించినా క్రమంగా తెల్ల వెంట్రుకలు తగ్గిపోతాయి

గుర్తుంచుకోండి

1) ఈ ఆయుర్వేద పద్దతులు పాటించేటప్పుడు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

2) బాగా వేడి వేడి నీళ్ళతో తల మీద స్నానం ఎప్పుడూ చేయకూడదు.

3) టెన్షన్ లేకుండా మానసిక ప్రశాంతతను అలవాటు చేసుకోవాలి.

4) జుట్టు కాలుష్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు (హెల్మెట్/ తలకట్టు) తీసుకోవాలి

ఈ ఆయుర్వేద మందులను తీసుకునేటప్పుడు జలుబు, దగ్గు, ఎలర్జీ లాంటి సమస్యలు ఉంటే ముందు వాటికి చికిత్స తీసుకొని … తగ్గిన తర్వాతే వీటిని వాడాలి.

(నోట్: ఈ ఆయుర్వేద చికిత్స విధానాలు పెద్దలు రూపొందించిన ఆయుర్వేద గ్రంథాల నుంచి సేకరించి ఇచ్చినవి. మీరు డాక్టర్ల సలహాతో వీటిని అనుసరించవచ్చు )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *