ఆల్కహాల్ తీసుకోవచ్చా.. అతిగా సేవిస్తే ఏమవుతుంది..?

ఆల్కహాల్ తీసుకోవచ్చా.. అతిగా సేవిస్తే ఏమవుతుంది..?

ఆల్కహాల్ తీసుకోవచ్చా.. ఎక్కువగా సేవిస్తే ఏమవుతుంది..?

మనిషికి ఎంత సంపాదించిన ఇంకా ఏదో ఓ కొత్త దనాన్ని కోరుకుంటారు. దీనిలో భాగంగా చాలా మంది సంతోషంగా ఉన్నా, బాధల్లో ఉన్న ఆల్కహాల్ కు ప్రయారిటీ ఇస్తారు. అయితే ఈ ఆల్కహాల్ తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి.  అయితే ఆల్కహాల్ ఎక్కువగా తాగితే  దాని వల్ల వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

ఆల్కాహాల్ తీసుకున్నప్పడు శరీరం బరువుగా ఉంటుంది…ఆ మత్తులో ఏ పనీ చేయాలనిపించదు. అయితే వైద్యులు సూచించిన విధంగా తినేదైనా, తాగేదైనా లిమిట్ లో ఉండాలని సూచిస్తుంటారు. అదే ఆల్కహాల్ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ సేవిస్తే మెదడులో ఉండే నరాలపై ఆల్కాహాల్ ప్రభావం పడిపోతుంది. దీంతో నాడి వ్యవస్థ దెబ్బతినడంతో పాటుగా గుండె పనితీరులో మార్పులు వస్తాయి, అంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. గాలి పీల్చుకునే విధానంలో కూడా తేడా వస్తుంది. దీంతో కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు.

ఆల్కహాల్ మెతాదు రక్తంలో ఇమిడిన తరువాత మాటల్లో తేడా వస్తుంది. ఆ తరువాత నడకలోనూ మార్పు వస్తుంది. దీంతో పాటుగా శరీరంలోని అవయవాలు తన ఆధీనం లోనుంచి పట్టుకోల్పోతాయి. తను నేను మందు కొట్టినా తెలివిగల వ్యక్తిగానే ఉన్నాడన భావన ఆ వ్యక్తిలో కలుగుతుంది. తన శక్తికి మించి  మద్యం సేవించడం వల్ల సోయి లేకుండా కిందపడిపోతారు. అయితే ఎవరైనా తనని పలకరిస్తే నేను పట్టుకోల్పోలేదని భావనలో ఏంటీ..ఏంటీ అంటూ సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉంటాడు. అది విఫలయత్నం అవుతుంది. దీంతో మెదడులో ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. దీంతో కోపానికి గురై అరిచే ప్రభావం ఉంది. ఆల్కహాల్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి తాగిన వెంటనే కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు. వైద్యులు రీసెర్చ్ చేసిన ప్రకారంగా ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేయడంతో పాటుగా శరీరంలోని అవయవానికీ, ప్రతి అణువుకూ చేరుతుంది.

నిత్యం మనం తీసుకునే ఆహార పదార్థాల కంటే  ఆల్కహాల్ శరీరంలోకి  వేగంగా ప్రసరిస్తుంది. అయితే మనం తిన్న తిండి జీర్ణాశయంలో ఉంటే.. మద్యం సేవించిన తరువాత జీర్ణం కానివ్వదు. కొంతమంది తిండి తినక ముందు ఆల్కహాల్ తీసుకుంటే జీర్ణాశయం నుంచి తరువాత చిన్నపేగు నుంచి డైరెక్ట్ గా రక్తంలో కలుస్తుంది. ఆల్కహాల్ మోతాదు రక్తంలో కలిసి మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికీ వెళ్తుంది. దీంతో కణాలను విచ్ఛిన్నం చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. దీంతో పాటుగా చెడ్ ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ తరువాత ఆల్కహాల్ (ethanol- C2H5OH) మొదట ఎసిటాల్డిహైడ్‌ (ethanal- C2H4O)గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది. దీంతో శరీరంలో అవయాలన్నీ పట్టు కోల్పోయి.. కడుపులో బాగా మంట వస్తుంది. దీంతో బాగా మద్యం అతిగా తాగేవారికి ఎక్కువ శక్తితో పాటుగా బరువు పెరగడానికి కారణం. అందుకే నీరసంగా…అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తుంటారు. తదుపరి ఏ పనిమీద దృష్టి ఉండదు. మరలా సాయంత్రం అయ్యే సరికి ఆల్కాహాల్ తీసుకోవాలనే కోరిక ఏర్పడుతుంది. ఆల్కాహాల్ పరిమితంగా తీసుకోకపోతే క్రమంగా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్, గుండె జబ్బు, షుగర్, పక్షవాతం, కనుచూపు, చేతులు వంకర్లు, విపరీతమైన కాళ్ల నొప్పులతో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆల్కాహాల్ సేవించినప్పుడు ఏ పద్దార్థాలను తీసుకోకూడదు: ఆల్కాహాల్ సేవించిన తర్వాత ఎప్పుడూ ఐస్ తోపాటుగా పాల ఉత్పత్తులు తీసుకుంటే  కడుపులో గ్యాస్, మంట లాంటి సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్‌ కూడా స్టఫ్‌గా తీసుకోకూడదు. చిప్స్ తినడం వల్ల చాలా దాహం వస్తుంది. దీని మంచినీళ్లు ఎక్కువయి ఇంకాస్త మద్యాన్ని మందుబాబులు మరింత ఎక్కువగా తాగుతారు. పాల ఉత్పత్తుల(Milk Products)తో తయారైన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఇది గుండెపోటు కు ప్రమాదానికి దారితీస్తుంది. ఆల్కాహాల్ సేవించిన తరువాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో ఆ వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆల్కాహాల్ సేవిస్తూ వేరుశెనగ,  పొడి జీడిపప్పు(Cashew) తినడం చేస్తుంటారు. దీనిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

ఆల్కాహాల్ తీసున్న తరువాత వాంతులు ఎందుకొస్తాయి..?   శరీరంలో మార్పులు ఏర్పడటంతో ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థమే వాంతులకు కారణం అవుతుంది. ఈ ప్రక్రియతో మద్యం ఎంత సేవిస్తే అన్ని వాంతులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఆల్కహాల్ మితిమీరినప్పుడు ఆహార పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియ జరుగుతుంది.

ఆల్కాహాల్.. హ్యాంగోవర్ దిగేదెలా? మద్యం ఎక్కువగా సేవించిన తరువాత తల భారంగా ఉంటుంది. అంటే  హ్యాంగోవర్‌ అయినట్లుగా గుర్తించుకోవాలి. దీంతో నిద్ర పట్టదు. వాంతులు, విరోచనాలు అవుతాయి. మరళా మద్యం త్రాగకుండా ఉంటేనే మంచిది. హ్యాంగోవర్  తగ్గించేందుకు మందులు లేవు. చాలా మంది మజ్జిగ, నిమ్మకాయ నీల్లు త్రాగుతుంటారు.. ఇది ఉపశమనం మాత్రమే…కానీ ఇది కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

రెడ్ వైన్ :  ఆల్కాహాల్ లో డేంజర్.. రెడ్ వైన్ ఇది త్రాగడం వల్ల బాగా హ్యాంగోవర్‌కు గురవుతారు.

వోడ్కా‌: ఈ వోడ్కాలో ఆల్కహాల్ మద్యం, నీరు మాత్రమే ఉంటాయి. దీనిలో ఆల్కాహాల్ శాతం తక్కువగా ఉంటుంది.
ఈ ఆల్కహాల్ పీయూష గ్రంథిని శుభ్ర పరిచి, వాసోప్రెసిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ మూత్ర నాళాలలో ఉండే సమస్యలను నియంత్రిస్తుంది. మీరు తాగే నీళ్ల కంటే.. ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. రక్తంలో నీరు తగ్గడం వల్ల తలనొప్పితో పాటుగా ఇతర అనార్థాలకు దారితీసే అవకాశం లేకపోలేదు.

సో.. ఏదీ ఏమైనా ఆల్కాహాల్ ను తక్కువ మోతాదులో తీసుకోవాలి సుమా.. పీపాలు.. పీపాలు త్రాగితే మీరు డేంజర్ లో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అయితే  ఈ మందు అనేది దేశ భౌగోళిక పరిస్థితుల బట్టి త్రాగుతుంటారు.  సో.. జాగ్రత్త మరీ..  బీ కేర్ ఫుల్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మరీ.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *