Wipro: వారంలో 2 రోజులు ఆఫీస్… Work From Home ముగింపు దిశగా..  

Wipro: వారంలో 2 రోజులు ఆఫీస్… Work From Home ముగింపు దిశగా..  

Wipro: వారంలో 2రోజులు ఆఫీస్… Work From Home ముగింపు దిశగా..  

దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల కారణంగా అనేక స్టాఫ్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం (work from home) ఇచ్చాయి. దీనిలో భాగంగా గత 8 నెలలుగా అమలు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోం విధానానికి విప్రో తెరతీసింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులోకి రావడంతో..కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టంది.. దీంతో ఎంప్లాయిస్ ని విప్రో కంపెనీ రావాలని ఆదేశించింది. సోమవారం నుంచి విప్రో ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. ఉద్యోగులు విధుల్లోకి చేరి తమ తమ పనిలో నిమ్మగ్నమైపోయారు. సదరు కంపెనీ కొంతమంది ఉద్యోగులను ఆఫీస్‌కు రాకుండా.. వారంలో కొన్ని రోజులు ఇళ్ల దగ్గర.. మరికొన్ని రోజులు ఆఫీస్‌ కు వచ్చి పనిచేయాలని విప్రో సంస్థ తెలిపింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సోమవారం నాటి నుంచి వారంలో రెండు రోజులు ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే సదరు కంపెనీ ఓ రూల్ ప్రవేశపెట్టింది.

కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల వేసుకున్న వారినే తమ ఆఫీసులకు ఉద్యోగులను అనుమతిస్తామని రిషాద్ ప్రేమ్‌జీ తెలిపారు. మా కంపెనీలో ప్రతి ఉద్యోగి మాస్క్ తో పాటు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ, ఉద్యోగులు సురక్షితంగా వచ్చి వెళ్లేలా, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రేమ్ జీ తెలిపారు. విప్రోలో చేసే ఉద్యోగుల ఆరోగ్య భద్రత పై తమ కార్యాలయాల్లో ఉద్యోగులకు చేసిన ఏర్పాట్లకు సంబంధించి ఓ వీడియోను కూడా ట్వీట్ చేశారు ప్రేమ్ జీ. విప్రో ప్రతి ఆఫీసులోనూ ఉద్యోగులకు క్యూఆర్‌ స్కాన్‌, జ్వరాన్ని పరిశీలించే యంత్రంతో పాటుగా శానిటైజర్లు ఏర్పాట్లు చేశారు.అయితే ఇప్పటి వరకు విప్రోలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గత జులై 14 నాటికే దాదాపు 55 శాతం మంది కొవిడ్‌ టీకాలు తీసుకున్నారని ఆయన తెలిపారు.

తమ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగిని మా కార్యాలయ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తారని తెలిపారు. మా సంస్థలో భవిష్యతులో కూడా హైబ్రీడ్ పని విధానాలు కొనసాగిస్తామని ప్రేమ్ జీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: