మరోసారి ముప్పుతప్పదంటున్న WHO

కరోనాను నిబంధనలు తప్పనిసరి

వైరస్ నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు

థర్డ్ వేవ్ ముప్పుందని హెచ్చరిక

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ అగ్రదేశాలతో సహా అన్ని దేశాలను వణికించింది. దీంతో ఈ మహమ్మారి రూపం నుంచి బయటపడేందుకు చాలా దేశాలు కృషి చేస్తున్నప్పటికీ ఈ కరోనా మరో రూపంలో దాల్చి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిందనే వార్తలు వస్తున్నాయే తప్పా ఎక్కడా వైరస్ పోయినట్లు తెలపడం లేదు. దీంతో మరోసారి థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందనే ముందస్తు హెచ్చరికలు కూడా వస్తూనే ఉన్నాయి. ఆ హెచ్చరికలనే బేఖాతరు చేయకుండా జనం విచ్ఛలవిడిగా తిరుగుతూ నిబంధనలను గాలికొదేలిసి తమ కార్యకాలపాలను చేసుకుంటున్నారు ప్రజలు. కొన్ని దేశాల్లో ఆంక్షల మధ్య కార్యకలాపాలు నడుస్తున్నప్పటికీ వైరస్ ఉధృతి తగ్గడం లేదు. దీంతో పాటుగా చావులు ఆగడం లేదు. నియంత్రణలు ఎన్ని పాటించినా ఆ వైరస్ నుంచి తప్పించుకునే మార్గాలు మాత్రం కనపడటం లేదు.

ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో, కొన్ని ప్రదేశాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత క్రమంగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి..కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే.. నిబంధనలు గాలికొదిలేసి ప్రజలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో పాటుగా ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే, కోవిడ్‌ 19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. క‌రోనా ముగిసిపోయింద‌ని కొంద‌రు భావిస్తున్నారని.. కానీ, ఆ మ‌హ‌మ్మారి నుంచి ప్రపంచం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో నిబంధనలు పాటించమని చెప్పినప్పటీకీ ఎవరూ పాటించడంలేదు.

తాజా డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాల గణాంకాలను బయటపెట్టింది. అయితే గ‌త వారం ప్రపంచ వ్యాప్తంగా 31 ల‌క్షల మందికి క‌రోనా పాజిటివ్‌గా అని తేలిందని.. మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.

ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా రూపం మార్చుకొని విజృంభిస్తోందని.. కోవిడ్‌ బాధితులతో ఆయా దేశాల్లోని ఆస్పత్రులు అన్నీ నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, మన దేశం సహా అన్ని దేశాలు కరోనా నిబంధనలు పట్టించుకోకుండా కొంద‌రేమో విచ్చల‌విడిగా తిరిగేస్తున్నారని తెలిపింది. ఈ రెండేళ్లలో క‌రోనా కాటుకు 50 ల‌క్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో.. కాగా, కొన్ని ప్రాంతాల్లో కరోనా విజృంభణ తగ్గి… మళ్లా కరోనా రోజువారి కేసులు పెరుగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే..కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. మరికొంతకాలం కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక, వ్యాక్సినేషన్‌తో రక్షణ కలుగుతుందని చెబుతున్నారు. మరి కొంతమందికి వ్యాక్సినేషన్ తీసుకున్నా మరోసారి కరోనా వస్తూనే ఉందని నివేదికలు చెబుతున్నాయి..అయినా భయపడొద్దని.. దాని రూపం అంతగా ఉండదని..కరోనా ఉగ్రరూపం నుంచి తట్టుకోవాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *