అక్కడ ఎక్కువ గంటలు కూర్చొని పనిచేస్తే ప్రమాద కరం

వర్క్ ఫ్రంహోం పని చేసే వారికి సూచనలు
నేటి కాలంలో చిన్నారుల నుంచి పెద్దలు దాగా మొబైల్ ఫోన్ వాడందే ఎవరూ ఉండలేరు. అన్నమైనా తినకుండా మానేస్తామో కానీ.. మొబైలో వాట్సాప్, టిక్ టాక్ దాకా.. అదేదో ఫేస్ బుక్ అటా.. దాన్నీ కూడా ముసలీ ముతకాతో సహా అందరూ చూసి ఆనందిస్తుంటారు. పొరపాటున సెల్ మరిచిపోతే.. మన బాడీలో ఏదో పార్ట్ మిస్సందనే భావన అందరిలో వచ్చేసింది. అది లేకపోతే కాలమే గడవదన్న అభిప్రాయం జనాల్లో వచ్చింది. అంటే సెల్ ఫోన్ మన జీవిత భాగంలో ఎంత ప్రభావం చూపుతోందో అర్ధమవుతుందా మరీ అయితే ఇది ఆందోళన కలిగించే విషయమే మరీ.. ఈ స్మూతుగా నొక్కె ఆ యంత్రం కదేంటో చూద్దామా మరీ..
ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్లపై అందరూ ఆధారపడటం పెద్దల నుంచి చిన్నా చితకా వరకు మైబైల్ ను చూడడం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం చిన్నారులకు ఆన్ లైన్ క్లాసుల నుంచి పడుకోబోయే దాకా పిల్లలు గంటల తరబడి మొబైల్ ఫోన్లలో అదే పనిగా ఫోన్ ని చూడడం సర్వసాధారణమైపోయింది. ఇది ఆరోగ్యారిత్యా చాలా హానికరమని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ పనిదాలు చేసే వారికి స్క్రీన్ ప్రమాదకరం
కరోనా పుణ్యమా అంటూ అందరు వర్క్ ఫ్రంహోం చేయాలని చాలా ఐటీ కంపెనీలు ఎంప్లాయిస్ ని ఆదేశించాయి. చేసేదేమి లేక మొబైల్, ల్యాప్‌టాప్ వాడకం మరీ ఎక్కువైంది. కొన్ని గంటలపాటు స్క్రీన్ ముందు కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి అన్ని గంటలు కూర్చొంటే ఏ రోగమైనా ఫ్రీగా వస్తుందండోయో… అదేదో కాదు కళ్ల సమస్యలతో పాటుగా మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందువల్లనంటే కూర్చోనే పోజిషన్ సరిగా లేకపోవడంతో పాటుగా గాలి, వెలుతురు.. పనిచేసే అట్మాస్పీయర్ సరిగా లేకున్న రోగాలు మీ వెంటే ఉంటాయి మరీ. అందుకే ఆఫీసులోన్నా, మరేక్కడున్నా మీకు అవసరమైనంత వరకు మాత్రమే మొబైల్, ల్యాప్‌టాప్‌ని వాడండి. లేనిచో వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. లేదంటే మీకు రోగాలు కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే.. దీనికోసం వేలకొలది రూపాయలు పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి.
ఎక్కువ సమయం స్క్రీన్, టీవీ, మొబైల్ ఫోన్ ముందు గడపటం వల్ల మనకు తెలియకుండానే మితి మీరిన ఆహారాన్ని తింటాం. దీంతో మనకు తెలియకుండానే రోగాలను కొని తెచ్చుకుంటాం. సో.. శరీర బరువు విపరీతంగా పెరుగడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా నిద్రలేమి సమస్యలు, గ్యాస్, అల్సర, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వస్తోయాని డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాలలో కూడా మార్పులు ఉండాలని చెబుతున్నారు. ఉదాహరణకు ఫ్రూట్స్, వాల్ నట్స్ తో సహా.. సహాజ సిద్ధమైన వంటలకు ( HOME FOOD) ప్రయారిటి ఇవ్వాలి.
ఈ సమస్యల వల్ల మన నాడి వ్యవస్థ అధికమైన ఒత్తిడికి గురువుతుంది. దీంతో మనం మన మానసికంగా దెబ్బతింటాం. మనం నియంత్రణ కోల్పోయి ఏ వస్తువు మీదనో లేక సందర్భాన్ని బట్టి ఆ ప్రదేశంలో ఉన్న మనిషి పై విరుచుకుపడడం జరుగుతుంది. అందుకే రిలాక్స్ కోసం బాడీలో నరాలను ఉత్తేజ పర్చటానికి మధ్యలో కొంత సమయం ఇచ్చి చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ లేదా యోగా, ధ్యానం వంటివి చేస్తూండాలి. సోషల్ మీడియా వాడటం మంచిదే కానీ పరిమితంగా ఉండాలి. సో.. ఇవి చేయకపోతే మీరు అనారోగ్యానికి గురవుతారని నిపుణులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.