పూర్తిస్థాయిలో చిన్నారులకు మలేరియా వ్యాక్సిన్
ఇండియాలో మలేరియాకు ఇప్పటి వరకు..
పూర్తిస్థాయిలో లేని వ్యాక్సిన్
చిన్నారులకు మలేరియా వ్యాక్సిన్
త్వరలోనే మీ ముందుకు రానున్న వ్యాక్సిన్
WTS RTS అనేపేరుతో వ్యాక్సిన్ తయారీ
భారత్ లో మలేరియా వ్యాధితో ప్రతి ఏటా లక్షలాది మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. ఈ జ్వరం ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో వస్తోంది. ఈ విషపు జ్వరమే (మలేరియా) ఇప్పటి వరకు పిల్లలకు సరైనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీంతో మన దేశంలో ఎక్కువగా చిన్నారుల్లోనే మరణాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నో మలేరియా వ్యాక్సిన్ పై ఎన్నో ప్రయోగాలు చేసిన వ్యాక్సినేషన్ కు ప్రయత్నించాయి. అవన్నీ తుది దశలోనే ప్రయోగాలు సక్సెస్ అవ్వలేదు. అయితే మలేరియా వ్యాక్సినేషన్ డబ్ల్యూటీఎస్ ఆర్టీఎస్ (WTS RTS )అనే పేరుతో మానవుల్లోని రోగ నిరోధక వ్యవస్థకు తగిన శిక్షణనిచ్చి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులపై పోరాడేందుకు ఈ టీకా దోహదం చేస్తుంది. ఈ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చిన్నారుల కోసం వ్యాక్సినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ను 5 నెలలు పైబడిన చిన్నారులకు వ్యాక్సిన్ అందించ వచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతినిచ్చింది. పిల్లలకు నాలుగు డోసుల్లో ఈ వ్యాక్సిన్ను అందిస్తారు. ఇప్పటికే ఆఫ్రికాలోని మూడు దేశాల్లో 2.5 మిలియన్ డోసుల టీకాలు అందించారు. ఈ టీకాలు సురక్షితమైనవవిగా క్లినికల్ ట్రైల్స్ తెలిసాయి. ఇప్పటికే 25 దేశాల్లో మలేరియా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో ప్రతి ఏడాది 2.65 లక్షల మంది చిన్నారులు మలేరియాతో మృతి చెందుతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మలేరియాతో మరణించే వారి సంఖ్యలో ఎక్కువగా పిల్లలే ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడైంది.