ఆ మూడు ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా

ఆ మూడు ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా

ఆ మూడు ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా

నాగ చైతన్యతో విడాకుల విషయమై సమంత గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ వ్యక్తిగత అభిప్రాయాలకు భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో సమంతపై నెగెటివ్ షేడ్ లో ప్రచారం బాగా జరిగింది. తన వైఖరితోనే తన విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వొచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సమంత ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. తనపై ఇలా కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోబోయేది లేదని కూడా హెచ్చరించింది. అయినా సోషల్ మీడియా కథనాలు ఆపలేదు.  తెలుగులో కొన్ని ప్రముఖమైన యూట్యూబ్ ఛానళ్లు,, వెబ్ సైట్లు కథనాలు రాస్తునే ఉన్నాయి. సమంత వ్యక్తిగత జీవితం పర్సనల్ విషయాలను లాగేసి నానా రభస చేశాయి. అందుకే  సమంత కోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహించారంటూ మూడు యూట్యూబ్ చానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. కోర్టు తీర్పు ఎలా ఇస్తుందనేది నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: