AP: నవంబర్ 30 వరకు ఆ ఉద్యోగాలకు డెడ్‌లైన్  

AP: నవంబర్ 30 వరకు ఆ ఉద్యోగాలకు డెడ్‌లైన్  

AP: నవంబర్ 30 వరకు ఆ ఉద్యోగాలకు డెడ్‌లైన్  

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. దీని కోసం నవంబర్ 30వరకు డెడ్ లైన్ విధించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాల్ని బలితీసుకుంది. దీంతో ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి. దీంతో కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచకుండా మారిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేదే కారుణ్య నియామకాల ప్రక్రియ. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 30 నాటికి కల్లా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ డెడ్‌లైన్ విధించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వాస్పత్రుల్లో నియామకం, జిల్లా కేంద్రాల్లోని హెల్త్ హబ్స్ ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం ఉండాలని సీఎం జగన్ సూచించారు.

అక్టోబర్ 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి..డిసెంబర్ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. డీఎంఈలో పోస్టులకు సంబంధించి డిసెంబర్ 5 నాటికి భర్తీ చేయనున్నారు. దీంతో పాటుగా apvvp (ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్)లో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబర్ 20-23 మధ్య నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఈ పోస్టులను డిసెంబర్ 21-25 మధ్య పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: