AP: వైఎస్సార్ రెండో విడత ఆసరా..79 లక్షల మందికి లబ్ధి
ఒంగోలులో ప్రారంభించనున్న సీఎం జగన్
7.97 లక్షల పొదుపు సంఘాలకు 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి
ఈ పథకం ద్వారా నాలుగు విడతల్లో చెల్లింపు
రెండో విడతలో రూ.6,439.52 కోట్లు పంపిణీ
10 రోజుల పాటు వెఎస్సార్ రెండో విడత కార్యక్రమం
తొలి రోజు 83 వేల సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లోని ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద రెండవ విడత చెల్లింపులను ఏపీ సర్కార్ డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులోని PVR బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్ YSR ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ చేయనున్నారు.ఈ పథకం ద్వారా జగన్ సర్కార్ ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలకు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకాన్ని 10రోజుల పాటుపంపిణీ చేయాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ పరిధిలో రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల లబ్ధిదారుల చొప్పున పది రోజుల పాటు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.