తిరుమల తరహాలో…యాదాద్రి ఆలయం

తిరుమల తరహాలో…యాదాద్రి ఆలయం
విద్యుత్ కాంతులతో వెలుగిపోతున్న ఆలయం
ఆలయాన్ని చూసేందుకు వస్తున్న ప్రజలు, భక్తులు
తెలంగాణాలో యాదాద్రి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశమే నెవ్వరపోయేలా తెలంగాణ సర్కార్…యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తోంది. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులను చూపురులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే అక్కడి ప్రతి నిర్మాణం ఎంతో అందంగా తీర్చిదిద్దారు శిల్పులు. యాద్రాద్రి దృశ్యాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
ఆ విద్యుత్ వెలుగుల్లో, వెన్నెల కాంతిలో శోభిల్లుతున్న యాదాద్రి ఆలయ అందాలను ప్రతి ఒక్కరూ తమ కెమెరాలలో బంధించుకుంటున్నారు ప్రజలు, భక్తులు. అయితే ఇప్పుడు ఆ ఆలయ ఫోటోలు సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద వైరల్ అవుతున్నాయి. అయితే స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోనే ఇది ఒక పెద్ద ఆలయంగా పేరొందుతుంది.