దేశంలో మరో వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి

దేశంలో మరో వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి
జైకోప్-డి వ్యాక్సిన్ ను వేసేందుకు..
3 డోసులకు అనుమతి నిచ్చిన డీసీజీఐ
12 ఏళ్లు దాటిన వారందరికీ జైకోప్-డి టీకాకు అనుమతి
దేశంలో జైకోపు-డి వ్యాక్సిన్ ను అభివృద్ధి చుసిన జైడస్ క్యాడిల్లా
దేశంలో రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్.. కరోనా తర్వాత డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ లతో దేశంలో ఆందోళన కొనసాగుతోంది. ఈ మూడో దశను తట్టుకునేందుకు అయిదో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తాజాగా జైడస్ కాడిల్లాకు చెందిన జైకోవ్-డీ వ్యాక్సిన్ ఎమర్జెన్సీలో వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వ డ్రగ్ ప్యానెల్ అనుతిమినిచ్చింది. అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSO) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) జైడస్ మూడు డోసుల వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది.
జైకోవ్-డీ వ్యాక్సిన్ కు అనుమతినిచ్చిన డీజీసీఐ.. అయితే భారత్‌లో ఈ వ్యాక్సిన్ రెండవ దేశీయ వ్యాక్సిన్‌గా జైకోవ్-డీ నిలవనుంది. జైకోవ్-డీ వ్యాక్సిన్ ను వేసేందుకు 12 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతిన్చిన డీజీసీఐ. అయితే ఇప్పటి వరకు ఏ టీకా కూడా 12 ఏళ్లు దాటిన వారికి టీకా లేదు.. అయితే జైకోవ్-డీ వ్యాక్సిన్ తొలి టీకాయే ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే సూదితో పనిలేకుండా చర్మంలోకి ఈ వ్యాక్సిన్ ను ఎక్కిస్తారు. నొప్పి లేకుండా ఫార్మాజెట్ అనే పరికరం ద్వారా దీనిని చర్మంలోకి ఎక్కిస్తారు.
జైడస్ క్యాడిలా జైకోవ్-డి వ్యాక్సిన్ ను అహ్మదాబాద్ లో ఓ ఫార్మా సంస్థతో కలిసి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు.. ఇది మూడు డోసుల టీకా. అయితే ఈ టీకాను తొలి డోసు తీసుకున్న (28 రోజుల తర్వాత..రెండో డోస్ తరువాత 45 రోజుల తర్వాత మూడో డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత .
సాధారణంగా సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ DNR టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటాయని.. శరీరంలో ఏ రోగాలు ఉన్నా.. ఈ టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని.. కంపెనీ ప్రకటించింది. అయితే ఈ కంపెనీ 12 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే నిర్వహించింది. అయితే ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ 12 ఏళ్ల వారిపై ప్రయోగాలు చేయలేదు.. అయితే క్లినికల్ ట్రయల్స్ చేసిన ఏకైక వ్యాక్సిన్ జైకోవ్-డి కావడం మరో విశేషం
కాగా ఇప్పటి వరకు దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్-డోస్ వ్యాక్సిన్ల కంపెనీలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐదు టీకాలకు కూడా 12ఏళ్ల గ్రూప్ వారికి మెడిసిన్ తయారు చేయలేదు. అయితే దేశంలో కోవాక్సిన్ తరువాత జైకోవి-డీని అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. జైడస్ కాడిల్లా ఏటా 120 మిలియన్ డోస్‌లను తయారు చేసి దేశీయంగా అందించాలని కంపెనీ యోచిస్తోంది.