గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్త తప్పదు !

Blog Healthy Life Latest Posts Top Stories Trending Now

Heart Attack

గుండె ఆరోగ్యం – ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షకాలు!

ఈ మధ్యకాలంలో గుండెపోటు అనేది యువతలో కూడా కనిపిస్తున్నది. గుండెకు సంబంధించిన సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో, ముందస్తు జాగ్రత్తలతో గుండె జబ్బులను నివారించవచ్చు. తాజా లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం, గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సకు కన్నా, ముందు దశల్లోనే పూడికలను గుర్తించి నివారించడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేస్తోంది.

 

గుండెపోటు ఎలా వస్తుంది?

గుండె కూడా ఒక కండరమే. ఇది పని చేయడానికి రక్తం అవసరం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే, రక్తప్రసరణలో ఆటంకం కలుగుతుంది. దీన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. కొవ్వు పేరుకున్న పూడికలు ఒక్కసారిగా చిట్లి, రక్తం గడ్డకట్టి, రక్తనాళాలు మూసుకుపోతే గుండెపోటు వస్తుంది.

Heart Attack

 

గుండెపోటు రాకముందే జాగ్రత్తలు తీసుకోండి!

చికిత్సలు ఉన్నా, సమస్య తీవ్రమైతే అవి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్తలే శ్రేయస్కరం.

Heart Attack

గుండెజబ్బులకు కారణాలు (ముప్పు కారకాలు):

అధిక రక్తపోటు (BP > 140/90 mmHg),అధిక కొలెస్ట్రాల్,మధుమేహం,శారీరక శ్రమలేమి,ఊబకాయం,పొగతాగే అలవాటు,మానసిక ఒత్తిడి,కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు

నివారణకు మూడు దశలు:

ప్రైమార్డియల్ ప్రివెన్షన్ – జబ్బు రాకముందే ఆరోగ్యకర జీవనశైలి అలవరచుకోవడం.

ప్రైమరీ ప్రివెన్షన్ – ముప్పు కారకాలు ఉన్నవారికి పూడికలు ఏర్పడకుండా జాగ్రత్తలు.

సెకండరీ ప్రివెన్షన్ – పూడికలు ఉన్నా గుండెపోటు రాకుండా కాపాడడం.

ప్రాధమిక ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం?

25 ఏళ్లు దాటిన తర్వాత కనీసం ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోవాలి.

50 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాది లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా చెకప్ చేయించాలి.

కొలెస్ట్రాల్, షుగర్, బీపీ మొదలైనవన్నీ ముందుగానే తెలుసుకోవచ్చు.

TMT, Stress Thallium, CT Calcium Score, CT Angiogram వంటి టెస్టులు వ్యాధులు గుర్తించడంలో ఉపయోగపడతాయి.

పిల్లల నుంచే ఆరోగ్యపు బీజాలు!

ఇప్పటి పిల్లల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం, డిజిటల్ ఆటలు పెరగడం వల్ల ఊబకాయం పెరుగుతోంది.

చిన్నప్పటి నుంచే సరైన ఆహారం, వ్యాయామం అలవరచాలి.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కలిసి దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి.

ఆహార అలవాట్లు & జీవనశైలి మార్పులు:

Heart Attack

తాజా కూరగాయలు, పండ్లు, గింజలు తీసుకోవాలి

ఉప్పు, నూనె, తగ్గించాలి,రెగ్యులర్ వ్యాయామం చేయాలి,బరువు అదుపులో ఉంచుకోవాలి,మద్యం, పొగతాగే అలవాట్లు మానాలి,మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి (యోగ, ధ్యానం చేయాలి.

Heart Attack

చివరిగా

గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్సలు ఎంత ఉన్నా, వాటికి వెయిట్ చేయకుండా ముందే జాగ్రత్త పడటం మెరుగైన మార్గం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆరోగ్యం సాధించాలంటే… ఆరోగ్యకర జీవనశైలే మెరుగైన గుండె ఆరోగ్యానికి మార్గం!

ఇది కూడా చదవండి :మూత్రపిండాల తో జాగ్రత్తలు. Kidneys care

Tagged

Leave a Reply