Warren Buffett Advices– EMIల బరువు మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది?
For English Version : https://indiaworld.in/warren-buffetts-advice-indias-emi-generation/
Warren Buffett భారతదేశంలో EMIల మీద ఆధారపడుతున్న యువతకు ముఖ్యమైన హెచ్చరిక చేశారు. No-cost EMIలు, Credit Cards, BNPL స్కీములు మనల్ని అప్పుల బారిన పడేస్తున్నాయని హెచ్చరించారు. ఈ పండగల సీజన్ టైమ్ లో ఆయన చెప్పిన మాటలు మనం ఆలోచించాల్సిందే.
అప్పుల పండుగలు !
Diwali వచ్చేస్తోంది, కొత్త ఫోన్లు, AirPods, EMI ఆఫర్లు… అన్నీ మనల్ని ఆకర్షిస్తున్నాయి. No Cost EMI అంటూ Mobile Phones, TVs, Laptops – ఏది కావాలన్నా నెలకు కొద్దిగా చెల్లించి ఇంటికి తీసుకురావచ్చు. కానీ ఈ సౌకర్యం మన భవిష్యత్తును బలహీనంగా మారుస్తుందని Warren Buffett హెచ్చరిస్తున్నారు.

భారత్ యువతపై EMI ప్రభావం
- iPhone కొనుగోలు చేసే వారిలో 70% మంది EMI ద్వారా కొంటున్నారు
- ₹50,000 కంటే తక్కువ జీతం పొందే 93% మంది క్రెడిట్ కార్డులు, BNPL స్కీములు మీద ఆధారపడుతున్నారు
- EMIలు ఇప్పుడు కేవలం ఇల్లు, కారు కోసం కాదు – ఫోన్లు, బట్టలు, ట్రిప్స్ కోసం కూడా
No Cost EMI – నిజంగా ఉచితమా?
ఒక ఫోన్ ₹80,000 అంటే భయంగా ఉంటుంది. కానీ ₹6,000 నెలకు అంటే easy అనిపిస్తుంది. కానీ అసలు సమస్య ఏమిటంటే:
- క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు 36–40% వరకు ఉంటాయి
- BNPL స్కీముల్లో 25% మంది డిఫాల్ట్ చేస్తున్నారు
- నెల జీతంలో మూడో వంతు డబ్బు అప్పులకే వెళ్తోంది
ఒక్క EMI కాదు సమస్య. రెండు EMIలు, రెండు క్రెడిట్ కార్డు బకాయిలు – ఇలా కలిపితే జీతం వచ్చేముందే ఖర్చు అయిపోతుంది.

Warren Buffett నాలుగు ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు
1️⃣ ముందుగా సేవ్ చేయండి, తర్వాత ఖర్చు చేయండి
జీతం వచ్చిన తర్వాత సేవింగ్స్ చేయడం కాదు. ముందే సేవ్ చేయాలని నిర్ణయించుకోండి.
2️⃣ క్రెడిట్ కార్డు = ఒక సౌకర్యం మాత్రమే
ఇది అదనపు డబ్బు కాదు. బిల్ మొత్తం చెల్లించకపోతే, అప్పు పేరుకుపోతుంది
3️⃣ కాంపౌండింగ్ మీకు ఉపయోగపడాలి
EMIలు కూడా కాంపౌండ్ అవుతాయి – కానీ మీ డబ్బును తినేస్తూ ఉంటాయని గుర్తుంచుకోండి
4️⃣ ఎమర్జెన్సీ కోసం డబ్బు దాచుకోండి
జీవితంలో అనూహ్య మార్పులు వస్తుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అందుకే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి

EMIల వల్ల మానసిక ఒత్తిడి
పండుగల సమయంలో అందరూ కొత్త ఫోన్లు కొంటుంటే, మనకి కూడా తీసుకోవాలనిపిస్తుంది. కానీ:
- అప్పు = ఒత్తిడి
- EMIలు = ఆర్థిక స్వేచ్ఛ కోల్పోవడం
- క్రెడిట్ = భవిష్యత్తు మీద ప్రభావం
Buffett అంటారు…. “మీకు అవసరం లేని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తే, మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు.”
భారత యువత Warren Buffett నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు
- మీ ఆదాయానికి తగ్గట్టే జీవించండి
- జీతం పెరిగినంత మాత్రాన ఖర్చు పెంచకండి
- దీర్ఘకాలిక లక్ష్యాల మీద దృష్టి పెట్టండి
- మీ ఖర్చులను ట్రాక్ చేయండి

ఈ పండుగ సీజన్లో ఒక చిన్న విజ్ఞప్తి
కొత్త ఫోన్లు, EMI ఆఫర్లు, BNPL స్కీములు – ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ Warren Buffett మాటలు గుర్తుంచుకోండి. అప్పు ఓ సైలెంట్ థీఫ్. ఒక్కరోజులో కాదు, కొన్ని నెలలుగా మీ డబ్బును తినేస్తుంది.




