గౌతమ్ అదానీకి (Goutam Adani) మరో భారీ కుదుపు. అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు (US Solar power contracts) దక్కించుకోడానికి లంచ ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. USA లో అదానీపై కేసు నమోదు కావడంతో ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై పడింది. ఆయన షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. న్యాయపరంగా ముందుకెళ్తామని అదానీ గ్రూప్ (Adani Group) చెబుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అదానీని అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి మరో ఇబ్బంది వచ్చి పడింది. అమెరికాలో సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం ఏకంగా 2100 కోట్ల రూపాయల లంచం US అధికారులకు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికాలో కేసులు ఫైల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో స్టాక్ మార్కెట్ (NSE) భారీ కుదుపు కనిపించింది. అదానీ షేర్లు (Adani group shares) పడిపోయాయి. ACC, Adani energy solutions, Adani enterprises, Adani green energy ఇలా Adani Groupకి చెందిన అనేక షేర్లు 10 నుంచి 20శాతం దాకా పడిపోయాయి. దాంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.14.28 లక్షల కోట్ల నుంచి రూ.12.42 లక్షల కోట్లకు పడిపోయినట్టు ఫార్చ్యూన్ పత్రిర తెలిపింది. దాంతో నష్ట నివారణకు అదానీ గ్రూప్ (Adani Group) స్పందించింది. అదానీపై గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారం… అక్కడి చట్టాలకు లోబడి తాము నడుచుకున్నామంటోంది. న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కుంటామని తెలిపింది. చట్టాన్ని గౌరవించి నడుచుకుంటున్నామనీ వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన పడాల్సిన అసవరం లేదని అదానీ గ్రూప్ అంటోంది.
కాంగ్రెస్ – బీజేపీ మాటల యుద్ధం
ప్రధాని మోడీ, అమిత్ షాకి సన్నిహిత మిత్రుడుగా అదానీకి పేరుంది. అందుకే అదానీ కేసుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ, అదానీ బంధం భారత్ లో వరకే సేఫ్… అమెరికాలో అలాంటివి కుదరవ్ అంటున్నారు. అవినీతి ద్వారా దేశంలో ఆస్తులను అదానీ కొల్లగొట్టారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఆయన్ని మోడీ కాపాడటం మానుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ (BJP) మండిపడుతోంది.
ట్రంప్ వస్తే అదానీ సేఫేనా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ కి అదానీ (Adani greetings to Trump) శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి 15 వేల ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే ఈ కేసు విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత కేసుకు సంబంధించి ప్రాసిక్యూటర్ గా బ్రియాన్ పీస్ ను బైడెన్ ప్రభుత్వం నియమించింది. జనవరిలో పీస్ రిజైన్ చేసే ఛాన్సుంది. అయితే భారత్ -అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అదానీపై ఆరోపణలు నిరూపితం అయితే ఆయన సహా ఏడుగురు నిందితులు అమెరికాలో శిక్షను అనుభవించాలి. ఇప్పటికే అదానీపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే మోడీకి మిత్రుడైన అదానీని అమెరికాకు ఎలా అప్పగిస్తారన్నది సస్పెన్స్ గా మారింది.