అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి. ట్రంప్ అధికారం చేపడితే… US Universities లో ప్రవేశాలు నిషిద్ధం. అలాగే విద్యార్థులకు ఎంట్రీని నిరాకరించే ఛాన్సుంది. విమానాల్లోనే విద్యార్థులను తనిఖీలు చేస్తారు. ఆపేస్తారు. అవసరమైతే స్వదేశాలకు వెనక్కి పంపుతారు. ఇలాంటి ఘటనలు గతంలో ట్రంప్ హయాంలో కూడా జరిగాయి. అందుకే ఇళ్ళకి Winter vacations కి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేయాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి.
ఈసారి వలసదారులకు చుక్కలే !
అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళందర్నీ బలవంతంగా వెనక్కి పంపిస్తానని ఎన్నికల ముందు నుంచే ట్రంప్ చెబుతున్నారు. గతంలో ఇలాగే అనేక దేశాల ప్రయాణీకుల మీద ఆంక్షలు విధించారు. అయితే మన స్టూడెంట్స్ వచ్చిన ఇబ్బంది ఏంటి అని అనుమానం రావొచ్చు. ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే వీసా, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంటే… అలాంటి Indian Students కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ యూనివర్సిటీల్లో లోపాలు ఉన్నా కూడా విద్యార్థులను అమెరికా చేరుకోగానే Airports లో ఆపేసే ఛాన్సుంది. అందుకే ఛాన్స్ తీసుకోవద్దని విద్యాసంస్థలు హెచ్చరిస్తున్నాయి.
US Universities లో మనోళ్ళే ఎక్కువ !
అమెరికాలో చదువుతున్న విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ మంది ఉన్నట్టు ఇటీవలి రిపోర్టుల బట్టి తెలుస్తోంది. అందులోనే తెలుగు రాష్ట్రాల నుంచి మరీ ఎక్కువగా ఉంటున్నారు. 2023-24 ఏడాదిలో చైనా కంటే మన భారతీయ విద్యార్థులే ఎక్కువగా అమెరికాలో చదువుల కోసం వెళ్ళారు. US Universitiesలో మనోళ్ళు 3.3 లక్షల మంది ఉంటే చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది మాత్రమే ఉన్నారు.
ట్రంప్ భయంతో ముందే క్లాసులు
జనరల్ గా New Year అయ్యాక వారం రోజులకు USA Universities లో క్లాసులు మొదలు పెడుతుంటారు. కానీ ట్రంప్ భయంతో… ఈసారి యూనివర్సిటీలో జనవరి 2 నుంచే క్లాసులు స్టార్ట్ చేస్తున్నాయి. జనవరి మొదటి వారం తర్వాత అమెరికాకు వెళ్ళడం బయటి దేశాల విద్యార్థులకు చాలా కష్టమయ్యే ఛాన్సుంది. అందుకే ముందే రమ్మని చెప్పినట్టు Indian Students చెబుతున్నారు. ఇప్పటికే యేల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా విద్యార్థులకు Orientation class కూడా నిర్వహించింది.