రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ అయితే అందరినీ ఆకట్టుకుంది. ఆ ఒక్క షాట్ చూస్తేనే డైరెక్టర్ బుచ్చిబాబు వేసుకున్న విజన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.
ఈ గ్లింప్స్ విడుదలైన తర్వాత, ఆ క్రికెట్ షాట్‌కి ఆదరణ పెరుగుతోంది. చిన్న టోర్నమెంట్లతోపాటు ఇప్పుడు ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కూడా తమ ప్రమోషన్ వీడియోలో ఈ షాట్‌ని రీక్రియేట్ చేసింది. సోమవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా డీసీ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్ చేసిన షాట్‌ని ఢిల్లీ ఆటగాడు సమీర్ రిజ్వీ మళ్ళీ చేసి చూపించాడు. పెద్ది గ్లింప్స్ బిజెఎమ్‌తో కట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డీసీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, పెద్ది టీమ్ కూడా దీన్ని రీట్వీట్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఇది SRHకు కీలకమైన పోరాటం. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించిన ఈ జట్టు, ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనైనా భారీ తేడాతో గెలవాల్సిందే. సినిమాకి వస్తే, పెద్దిలో ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కాదు, సినిమా లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 27న థియేటర్లలో సందడి చేయబోతోంది పెద్ది మూవీ.
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/