ఇరాన్ ని చావు దెబ్బ తీసిన ఇజ్రాయెల్ !

Latest Posts NRI Times Top Stories

టెల్ అవీవ్ : గత రెండు మూడేళ్ళుగా ప్రపంచంలో యుద్ధాల కాలం నడుస్తోంది. మూడేళ్ళ క్రితం రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన వార్… ఇప్పటికీ నడుస్తోంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ – హమాస్ మధ్య నడిచింది… నడుస్తూనే ఉంది… సరే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియా – పాకిస్తాన్ మధ్య కూడా చిన్నపాటి యుద్ధమే నడిచింది. శుక్రవారం నాడు ఇంకో యుద్ధం మొదలైంది. ఇరాన్ పైనా దాడి చేసింది ఇజ్రాయెల్. ఎంత కరెక్ట్ గా అంటే… ఇరాన్ అణుకార్యక్రమాన్నే గట్టిగా దెబ్బ తీసింది… భవిష్యత్తులో మళ్ళీ అణు యుద్ధం పేరుతో ఏ దేశం కూడా భయపెట్టలేని పరిస్థితి ఈ వార్ తో కలిగింది.
ఈ భీకర దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా కొందరు కీలక వ్యక్తులు చనిపోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్‌లోని న్యూక్లియర్‌ ప్లాంట్‌, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్‌కు చెందిన జెట్లు తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ ఏరియాలో భారీఎత్తున పొగ కమ్ముకున్న దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక, నతాంజ్‌ ప్రాంతంలోని అణుకేంద్రం దగ్గర కూడా మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతలతో ఇరాక్‌ ముందుజాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. అటు టెహ్రాన్‌లో ఎమర్జన్సీని ప్రకటించారు.

ఇరాన్ ని కంట్రోల్ చేయడం అమెరికాకి కూడా చేతకాలేదు. దాన్ని ఇజ్రాయెల్ చేసి చూపించింది. గత కొన్నేళ్ళుగా ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలను అణు యుద్ధం పేరుతో బెదిరిస్తోంది…
యురేనియం శుద్ది చేస్తోంది… ఇప్పటికే 9 అణుబాంబులను తయారు చేసేంత యురేనియం రెడీగా ఉందని చెబుతున్నారు. వాటిని తీసుకెళ్ళే క్షిపణులను కూడా సిద్ధం చేసింది ఇరాన్. మాటి మాటికీ అణ్వాయుధ బూచీని చూపించి బెదిరిస్తుంటే తట్టుకోలేకపోయింది ఇజ్రాయిల్ …. అందుకే తన దేశాన్ని రక్షించుకోడానికి తెగించింది. ఇరాన్ అణు కార్యక్రమం మీద దృష్టిపెట్టి ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఈ భారీ దాడులకు పాల్పడింది. శత్రువు మూలాల్ని…కూకటి వేళ్ళతో పెకిలించాలన్నది ఇజ్రాయిల్ పద్ధతి… అందుకే ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్‌ ని హతమార్చింది. ఇద్దరు సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టుల ప్రాణాలు కూడా పోయాయి.

Tagged