ముంబై నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానానికి పెను ముప్పు తప్పింది. మూడు గంటల పాటు అది గాల్లోనే చక్కర్లు కొట్టి చివరికి ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరింది. శుక్రవారం ఉదయం 5.39 గంటలకు ఏఐసీ129 ఫ్లైట్ స్టార్ట్ అయింది. లండన్ కు వెళ్లే క్రమంలో దాని జర్నీ ముందుకు సాగలేదు. ఈ సంఘటనపై ఎయిరిండియా స్పందించింది. “ఇజ్రాయిల్ దాడి కారణంగా.. ఇరాన్ తన గగనతలాన్ని మూసేసింది. దీనివల్ల అనేక విమానాల రూట్ మళ్లించారు. కొన్నింటికి వెనక్కి పంపించారు. ఏఐసీ129ను అందుకే రిటర్న్ అయింది” అని తెలిపింది. ఇరాన్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా తమ విమానాలను వేరే రూట్ లో నడుపుతున్నామని.. ఒకవేళ అలా వీలుకాకుంటే వెనక్కి తిప్పి పంపుతున్నామని వెల్లడించింది.
ఇరాన్ తమ గగనతలాన్ని మూసేయడంతో ఎయిరిండియా విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అలా ఇప్పటి వరకు 16 ఫ్లైట్స్ కు ఇబ్బంది ఎదురైంది. దీంతో ప్యాసింజర్లు అవస్తలు పడుతున్నారు. గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఇలాంటి సంఘటనలు వారికి కలవరపెడుతున్నాయి.
అమెరికాలో తప్పిన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రన్ వేపై ఓ ఫ్లైట్ స్కిడ్ అయి పక్కకు దూసుకెళ్లింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు.
Read also : ఇరాన్ ని చావు దెబ్బ తీసిన ఇజ్రాయెల్ !
Read also : మంగ్లీ మీద ఎందుకంత కోపం !