జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక: పార్టీల్లో టెన్షన్

Latest Posts Trending Now

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక రాబోతోంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ, గెలుపు ఎవరిదన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ… మూడు పార్టీలూ గట్టిగా పోటీ పడుతున్నాయి. ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది? అభ్యర్థులు ఎవరు? ఈ ఎన్నిక ఫలితం ఎటువైపు మళ్లుతుంది? అన్నది ఉత్కంఠగా మారింది.

కాంగ్రెస్ జోరు, రేవంత్ పట్టుదల

కాంగ్రెస్‌కి ఈ ఎన్నిక ఓ సవాల్ గామారింది. గత ఏడాది కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లోనూ అదే జోష్‌ని కొనసాగించాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సీటును గెలవడం ప్రతిష్ఠగా తీసుకున్నారు. అభ్యర్థి ఎంపికను హైకమాండ్‌కు వదిలేసిన రేవంత్… ఎవరూ ప్రకటనలు చేయొద్దని చెప్పారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ తానే పోటీ చేస్తానని ప్రకటించడంతో, పీసీసీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన మెత్తబడ్డారు. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇస్తే, కాంగ్రెస్‌కి గెలుపు అవకాశాలు బాగా పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి.

బీఆర్ఎస్‌కి ప్రతిష్ఠాత్మక యుద్ధం
జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో, దీన్ని కాపాడుకోవడం ఆ పార్టీకి చాలా ముఖ్యం. మాగంటి గోపీనాథ్ రెండుసార్లు ఈ సీటును గెలిచారు. ఇప్పుడు పార్టీ అతని భార్య సునీతను బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది. సునీత ఒప్పుకుంటే, ఆమెపై సానుభూతి ఓట్లు బీఆర్ఎస్‌కి కలిసొస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ సునీత వద్దనుకుంటే, పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి బీఆర్ఎస్ సర్వేలు చేస్తోంది.

బీజేపీ వ్యూహం
బీజేపీ కూడా ఈ ఎన్నికను తేలిగ్గా తీసుకోవడం లేదు. టీడీపీ, జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ప్లాన్‌లో ఉంది. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు అభ్యర్థిగా వినిపిస్తోంది. ఈ కూటమి సర్వేల ద్వారా తమ అవకాశాలను అంచనా వేస్తోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ గా కమలం పార్టీ భావిస్తోంది.

ఎంఐఎం కీ రోల్
జూబ్లీ హిల్స్‌లో మైనారిటీ ఓట్లు ఫలితాన్ని గట్టిగా ప్రభావితం చేస్తాయి. ఎంఐఎం ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందా లేదా కాంగ్రెస్‌కు మద్దతిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఒకవేళ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తే, అధికార పార్టీకి గెలుపు అవకాశాలు బాగా పెరుగుతాయి. లేదా స్వతంత్రంగా పోటీ చేస్తే, ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్‌కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.

అభ్యర్థులే గెలుపు గుర్రాలు
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకం. బీఆర్ఎస్ మాగంటి కుటుంబంపై ఆధారపడితే, కాంగ్రెస్‌లో అజహరుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపితే టఫ్ ఫైట్ ఉండొచ్చు. స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలం, పార్టీల వ్యూహాలు… ఇవన్నీ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. బీఆర్ఎస్ సీటు కాపాడుకోవాలని, కాంగ్రెస్ గెలవాలని, బీజేపీ కొత్త ఒరవడి సృష్టించాలని పట్టుదలతో ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఫలితం ఎవరి వైపు మళ్లుతుందో చూడాలి!జూబ్లీహిల్స్ బరిలో నందమూరి వారసురాలు… టీడీపీ నయా ప్లాన్

Also read: రెండో టెస్ట్‌లో ఎవరికి చోటు?

Also read: కవిత రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్టు ఉందా ?

Also read: ‘వార్‌ 2’ కౌంట్ డౌన్ స్టార్ట్ : ఎన్టీఆర్

Also read: https://www.msn.com/en-in/news/India/jubilee-hills-bypoll-set-to-reshape-hyderabad-politics-congress-eyes-gains-brs-banks-on-legacy-bjp-seeks-foothold/ar-AA1HvFBg

Tagged

Leave a Reply