- ఎవరూ ఎవరికీ ఏమీ కారు
మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలి
ఎవరూ ఎవరికీ ఏమీ కారు….సినీ రంగంలో ఉన్నవాళ్ళైనా
సామాన్య జీవులు అయినా జాగ్రత్తలు ముఖ్యం!
సినిమా రంగంలో చిన్న నటుడైనా, సామాన్య వ్యక్తి అయినా,
సంపాదించే సమయంలో ఆరోగ్యాన్ని, ఆర్థిక భద్రతను పట్టించుకోకపోతే,
చివరకు కష్టాలు తప్పవు.
ఫిష్ వెంకట్ మరణం ఈ విషయంలో అందరికీ ఓ పెద్ద గుణపాఠం.
సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే, “పెద్దలు సాయం చేయలేదు” అని కుటుంబం ఆరోపించడం, మన లాంటి సామాన్యులైతే ” మమ్మల్ని బంధువులు పట్టించుకోలేదు” అని బాధపడటం సర్వసాధారణం.
కానీ, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి…
ఫిష్ వెంకట్ కథ: మనందరికీ గుణపాఠం
ఫిష్ వెంకట్ తెలుగు సినిమాల్లో సైడ్ విలన్, కామెడీ రోల్స్‌లో తనదైన తెలంగాణ యాసతో ఆకట్టుకున్న నటుడు.
‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాల్లో అతని కేరక్టర్స్ మనకు బాగా గుర్తుండి పోతాయి…
బాగా సంపాదించాడు, కానీ ఆరోగ్యాన్ని, ఆర్థిక భద్రతను పట్టించుకోలేదు.
ఒక ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు, “నేను రోజూ 35 గుట్కాలు నమిలేవాడిని” అని.
సారీ అతను చనిపోయాడు… అతని మీద అబండాలు వేయడం లేదు…
ఆయన జీవితం మనకీ ఓ గుణపాఠం కావాలని మాత్రమే చెబుతున్నా…
ఎవరికైనా నా వీడియో బాధ కలిగించి ఉంటే క్షమించండి…
ఫిష్ వెంకట్ కి మద్యం, చెడు అలవాట్లు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.
గ్యాంగ్రీన్, కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు.
చికిత్సకు రోజుకు 70 వేలు ఖర్చయ్యేది.
కొందరు దాతలు, మంత్రి శ్రీహరి, మైనంపల్లి లాంటి వాళ్లు సాయం చేశారు.
ప్రభుత్వం కూడా ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చింది.
కానీ, కిడ్నీ డోనర్ కోసం వెతుకుతుండగా, దురదృష్టవశాత్తూ అతను కన్నుమూశాడు.
ఫిష్ వెంకట్ కుమార్తె మీడియాతో మాట్లాడారు…
“నాన్నతో కలిసి నటించిన హీరోలు ఎవరూ సాయం చేయలేదు.
విశ్వక్ సేన్, కృష్ణ మాండ్యా లాంటి వాళ్లు, నాన్నతో నటించకపోయినా,
రెండు లక్షల చొప్పున ఇచ్చారు. కానీ, ఇవి కిడ్నీ సమస్యకు సరిపోతాయా?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీ పెద్దలు రాలేదని, నివాళులు అర్పించలేదని కొన్ని మీడియా సంస్థలు కూడా గోల చేశాయి.
సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే, మొత్తం ఇండస్ట్రీ తరలిరావాలని ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో…
కోట శ్రీనివాసరావు తప్ప… ఈ మధ్యకాలంలో… జమున, సరోజా దేవి లాంటి సీనియర్ నటుల అంతిమ యాత్రలకు కూడా పెద్దగా ఎవరూ రాలేదు.
ఫిష్ వెంకట్ లాంటి చిన్న నటుల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు రాకపోవడం సహజం.
సినిమా రంగం ఒక కుటుంబం అని వేదికలపై మాట్లాడినంత మాత్రాన,
అందరూ కుటుంబ సభ్యుల్లా ఉంటున్నారా… లేదు కదా…
ఇండస్ట్రీలో కులం… వాళ్ళ స్థాయి… వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు, వేవ్‌లెంగ్త్‌లు బాగా పనిచేస్తున్నాయి.
పెద్ద నిర్మాత, దర్శకుడు, లేదా స్టార్ నటుడు చనిపోతేనే ఇండస్ట్రీ తరలివస్తుంది.
చిన్న నటుల విషయంలో అలాంటి ఆదరణ దొరకడం లేదు…
మీడియా కూడా ఈ విషయంలో హడావిడి చేయడం సహజం…
కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గర లైవ్‌లు పెడితే… పెద్ద పెద్ద నటులు వస్తారు…
TRP రేటింగ్ పెరగుతుందని వాళ్ళ మీడియా ఛానెళ్ళ ఆశ.
కానీ ఫిష్ వెంకట్ ఇంటి దగ్గరకు వెళ్లిందా?
యూట్యూబర్స్ కొందరు మాత్రమే ఫిష్ వెంకటేష్ ఇంటికి వెళ్ళారు.
ఇది సినీ రంగంలో సాధారణం. చిన్న నటులు చనిపోయినప్పుడు,
టీవీలో ఓదో చిన్న వార్త వేస్తారు…
సరే… ఫిష్ వెంకటేష్ విషయంలో జరిగిన సంగతి ఇది…
ఇక మన జీవితాల విషయానికి వద్దాం….
మనకీ ఇలాంటి సమస్యలే ఎదురువుతాయి… చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది..
ఈ సమస్య సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదు.
సామాన్య వ్యక్తి కూడా సంపాదించే సమయంలో
ఆరోగ్యాన్ని, ఆర్థిక భద్రతను పట్టించుకోకపోతే,
చివరకు కుటుంబం కష్టాల్లో పడుతుంది.
చాలామంది లగ్జరీ లైఫ్ స్టయిల్ కోసం అప్పులు చేస్తారు,
చెడు అలవాట్లకు బానిసలు అవుతారు…
ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, “బంధువులు సాయం చేయలేదు… వాడి దగ్గర అన్ని డబ్బులు ఉన్నయ్… అంత సంపాదించాడు… ఇంత సంపాదించాడు… అని ఆరోపణలు చేస్తారు…
కానీ, ఎవరి కుటుంబం సంగతి వాళ్ళదే…
ఒకటి బాధ్యత మరొరకు తీసుకోరు.
సినీ రంగంలో ఫిష్ వెంకట్ లాంటి వాళ్లు ఇండస్ట్రీని ఆశిస్తే,
సామాన్య జీవితంలో బంధువులను ఆశిస్తారు.
రెండూ ఒకలాంటి సమస్యలే… కాకపోతే రెండు కోణాలు ఉన్నాయి..
ఉదాహరణకు, తమిళనాడులో నటి పాకీజా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కన్నీళ్లు పెట్టి,
“సినీ ఇండస్ట్రీ సాయం చేయలేదు” అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమెకు పవన్ కళ్యాణ్ రెండు లక్షలు సాయం చేశారు,
కానీ అది అలవాటుగా మారిపోయిందని కొందరు అంటున్నారు.
నేను మొన్నామధ్య దీనిపై వీడియో ఇస్తే… కింద కామెంట్స్ లో కొంతమంది ఇదే అన్నారు..
పవన్ కల్యాణ్ గతంలో కూడా సాయం చేశారు…
ప్రతి సారీ వచ్చి సాయం చేయలేదు … అంటే ఎలా అని కామెంట్ చేశారు..
వాళ్ళు అన్నది కరెక్టే మరి…
సినీ నటులకే కాదు… మన లాంటి సామాన్యుల జీవితంలో కూడా జరగబోయేది ఇదే
చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా, అప్పులు చేసి, చివరకు కష్టాల్లో పడుతున్నారు..
2023లో ఒక రిపోర్ట్ ప్రకారం, భారత్‌లో 60% కుటుంబాలు ఆరోగ్య బీమా లేకుండా ఉన్నాయి,
దీనివల్ల వైద్య ఖర్చులు భరించలేక అప్పుల్లో కూరుకుపోతున్నాయి.
ఏం చేయాలి?
ఫిష్ వెంకట్ కథ సినీ రంగంలోని చిన్న నటులకు, సామాన్యులకు ఒక గుణపాఠం.
అతను ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సభ్యత్వం కూడా తీసుకోలేదని అంటున్నారు..
ఒక వేళ మెంబర్షిప్ ఉంటే, ఇన్సూరెన్స్ ఫెసిలీటీ ఉండేది. అయినా,
‘మా’ సంస్థ కొంత సాయం చేసింది. కానీ, ఇండస్ట్రీ పెద్దలు, లేదా బంధువులు సాయం చేయాలని ఆశించడం కంటే, సొంత జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
మనందరికీ గుణపాఠం ఏంటంటే…
ఆరోగ్యాన్ని కాపాడుకోండి: మద్యం, గుట్కా లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోండి.
ఆర్థిక భద్రత: సంపాదించిన డబ్బులో కొంత ఆదా చేయండి. లగ్జరీ జీవనం, అనవసర ఖర్చులకు అప్పులు చేయకండి.
ఆరోగ్య బీమా: ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా తీసుకోవాలి. 2025లో భారత్‌లో అనేక బీమా స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి, ఉదాహరణకు, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలు, తెల్ల రేషన్ కార్డుదారులైతే రాష్టంలో ఆరోగ్యశ్రీ ఉంది… .
ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి…
ఇది అందరికీ వర్తిస్తుంది
ఫిష్ వెంకట్ కథ మన కళ్ళు తెరిపించాలి.
ఆరోగ్యం, ఆర్థిక భద్రతను పట్టించుకోకపోతే, చివరకు కుటుంబం కష్టాల్లో పడుతుంది.
సినీ ఇండస్ట్రీని, బంధువులను ఆశించడం కంటే,
సొంత జాగ్రత్తలు తీసుకోవడమే శాశ్వత పరిష్కారం. అందరూ జాగ్రత్తగా ఉందాం!
Also read: లోన్లకు సిబిల్ స్కోర్ అక్కర్లేదా?
Also read: అరెస్ట్ చేయకుండా జగన్ పక్కా ప్లాన్
Also read: బీహార్ లో 41 లక్షల ఓటర్లు మిస్సింగ్