ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం
తిరుగుబాట్లతో అన్ని పార్టీలు సతమతం
తెలంగాణా రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు
సీఎం రేవంత్ కు తలనొప్పిగా కోమటిరెడ్డి రాజగోపాల్
బీజేపీలో.. రాజాసింగ్, ఈటెల తిరుగుబాటు స్వరాలు
ప్రస్తుతం తెలంగాణాలోని ప్రధాన పార్టీలన్నీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతున్నాయి. స్థానిక ఎన్నికల ముందు అన్ని పార్టీల్లో ఊపందుకుంటున్న ధిక్కార
స్వరాలు.. ఆ పార్టీ అధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లో ఒకేసారి ముసలం రావడమే.. ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి డైరెక్ట్ ఎటాక్ :
మంత్రి పదవిని ఆశించి తీవ్రంగా భంగపడ్డ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీలో తన అసమ్మతి స్వరాన్ని వినిపించారు. “పదేళ్లు నేనే సీఎంగా ఉంటా” అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం పదవిని పార్టీలో “ఎవరూ శాశ్వతంగా రాయించుకోలేరని”, పార్టీలో “అందరి సమిష్టి నిర్ణయమని” సీఎం రేవంత్ రెడ్డిపై కౌంటర్ అటాక్ చేశారు. ఇది “పార్టీ విధానాలకు వ్యతిరేకమని.. పార్టీని “సొంత సామ్రాజ్యంలా భావిస్తే, పార్టీ నేతలు, కార్యకర్తలు సహించరని” తీవ్రంగా విమర్శించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు “ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం ఎన్నిక ఉంటుందని” చెప్పారు. అంతే కాకుండా సీఎం పదవికి “తాను రేసులో ఉన్నానని”, మంత్రి పదవి కూడా దక్కకపోవడం పట్ల “తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు” రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా సీఎంను ఉద్దేశించినవే కావడంతో కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
కేసీఆర్, కేటీఆర్ కు తలనొప్పిగా కవిత :
నాకూ సీఎం అవ్వాలని ఉంది అంటూ.. మనసులో మాట బయటపెట్టిన కవిత వ్యవహారం గులాభీ పార్టీలో గుబులు రేపుతోంది. అప్పట్లో కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ విడుదల కావడం, ఆ తర్వాత పార్టీలో “దయ్యాలున్నాయని” వ్యాఖ్యలు చేయడం నుంచి తెలంగాణ జాగృతి జెండా, ఎజెండా వరకు గులాబీ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనే కవిత నేరుగా అసమ్మతి అస్త్రం సంధించడం విశేషం. ఇప్పటివరకు దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి ఉంది. ఇలాగే కవిత తన సొంత ఎజెండాతో పని చేసుకుంటూ పోతే చర్యలు తప్పవన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే.. తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కవితను తీసేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. తీన్మార్ మల్లన్న వివాదంలో కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కవిత వ్యవహరించిందన్న భావన వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ప్రతిపక్షంగా బలపడాల్సిన తరుణంలో ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న వ్యాఖ్యలు, రాజకీయంగా వేస్తున్న అడుగులు ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పార్టీ ముఖ్యులు అంతర్గతంగా మదనపడుతున్నారు.
బీజేపీలో బండిపై ఈటల డైరెక్ట్ ఎటాక్ :
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉండి, చివరిలో తప్పిపోయినప్పటి నుండి ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయంగా కొంత మౌనంగా ఉన్నారు. తాజాగా.. బండి సంజయ్ ను ఉద్దేశించి..
“నీ చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో మొత్తం పైకి పంపిస్తా… నా చరిత్ర తెలియదు నా…..కొ…కా”
“2019లో మోదీ ప్రభంజనం ఉన్నా నేను గెలిచా. టీఆర్ఎస్‌కు 53 వేల మెజార్టీ వచ్చింది. నీకు మెజార్టీయే రాలేదు.” “నేను ఎవరికీ భయపడేది లేదు. నాపై జరిగే కుట్రలను ఎదుర్కొంటా.”
“కడుపులో కత్తులు పెట్టుకునే వారు పార్టీలో ఉంటారు. వారితో యుద్ధం చేయడం కష్టం కానీ ఎదురెళ్లి నిలబడాల్సిందే.” “నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజల మధ్యే ఉంటా, నా బలం ప్రజాదరణ. పార్టీ కాదు, ప్రజలే.” అంటూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై.. నేరుగా ఈటెల విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలా ఈటెల వర్సెస్ బండి, రాజాసింగ్ వర్సెస్ మాధవీలత.. ఇలా.. పార్టీలోని అంతర్గత విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ అంతర్గత సమస్యలను పరిష్కరించకపోతే ఈ మూడు పార్టీలకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: ఫిష్ వెంకట్ కథ: మనందరికీ గుణపాఠం
Also read: లోన్లకు సిబిల్ స్కోర్ అక్కర్లేదా?
Also read: అరెస్ట్ చేయకుండా జగన్ పక్కా ప్లాన్
Also read: https://hydkhabar.com/2025/02/telangana-political-parties-internal-conflicts/