* ఆసియాకప్ లో పాక్ తో మ్యాచ్ వద్దు
* సోషల్ మీడియాలో #BoycottAsiaCup
* పహల్గామ్ దాడికి అభిమానుల నిరసన
* క్రికెట్ అభిమానులకు పొలిటికల్ లీడర్స్ మద్దతు
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న UAEలో జరగబోతోంది. కానీ, పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత ఈ మ్యాచ్‌ని రద్దు చేయాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఎక్స్ లో #BoycottAsiaCup విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రెండు మూడు రోజులుగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పార్టీల లీడర్లు కూడా అభిమానులకు సపోర్ట్ చేస్తున్నారు.
పహల్గామ్ దాడి…దేశంలో ప్రతి ఒక్కరి హృదయం గాయపడిన సంఘటన. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్టులు ఉన్నారు. దీనికి సమాధానంగా ఇండియా “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాకిస్తాన్, PoKలోని టెర్రర్ క్యాంప్‌లపై స్ట్రైక్స్ చేసింది. ఈ ఘటన తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ పీక్స్‌కి చేరాయి. ఇలాంటి సమయంలో, ఆసియా కప్‌లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ చేయడంతో ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. “ఇది కేవలం క్రికెట్ కాదు, మన దేశ ప్రజల గౌరవం !” అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BoycottAsiaCup అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. “మన సైనికుల రక్తం కంటే క్రికెట్ ముఖ్యమా?” అని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ ఈ మ్యాచ్‌ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు.
ఈమధ్యే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో ఇండియా చాంపియన్స్ టీమ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్స్ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. పహల్గామ్ దాడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాతే… ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు. దాంతో ఫ్యాన్స్‌లో మరింత ఫైర్ పుట్టించింది.
రాజకీయ నాయకుల వాదనలు
ఈ ఇష్యూ రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయింది. శివసేన (ఉద్ధవ్ థాకరే) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, “BCCI, మన సైనికుల రక్తం కంటే లాభమా ముఖ్యం?” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ సుఖ్దేవ్ భగత్ కూడా ఈ మ్యాచ్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజహరుద్దీన్, “బైలాటరల్ మ్యాచ్‌లు ఆడటం లేదు కదా, మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో ఎందుకు ఆడాలి?” అని ప్రశ్నించాడు. అయితే, మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం, “స్పోర్ట్స్ కంటిన్యూ కావాలి. టెర్రరిజం ఆగిపోవాలి, కానీ స్పోర్ట్స్ ఆగకూడదు,” అని సపోర్ట్ చేశాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ అతని వాదనతో ఏకీభవించలేదు.
మరి బీసీసీఐ స్టాండ్ ఏంటి?
బీసీసీఐ ఇంకా ఈ మ్యాచ్‌ని రద్దు చేస్తామని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. “ఈ నిర్ణయం ACC మీటింగ్‌లో తీసుకున్నారు. ఇండియా హోస్ట్ నేషన్ కాబట్టి, ఇప్పుడు షెడ్యూల్ మార్చడం కష్టం,” అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కానీ, ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది.
ఆసియా కప్పా… దేశభక్తా ?
ఫ్యాన్స్ ఒక్కటే చెప్తున్నారు: “పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తోందని ఆరోపణలు ఉన్నప్పుడు, క్రికెట్ ఎందుకు? మన సైనికులు, ప్రజల ప్రాణాలు కంటే ఒక మ్యాచ్ ముఖ్యమా?” ఎక్స్ లో రాస్తున్నారు. “మనమందరం ఆసియా కప్‌ని బాయ్‌కాట్ చేస్తున్నాం, అంతే ?” అని ఒకరు పోస్ట్ చేశాడు. ఇదే సమయంలో, గతంలో 2016 ఉరి ఎటాక్ తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య బైలాటరల్ క్రికెట్ సిరీస్‌లు ఆగిపోయాయి. ఇప్పుడు ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లోనే ఈ రెండు టీమ్స్ పోటీ పడుతున్నాయి. పహల్గామ్ లాంటి ఘటన తర్వాత, ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లను కూడా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also : ప్రాచీన శివాలయం కోసం యుద్ధం : బౌద్ధ దేశాలు థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణ
BEST CRICKET KIT with Reasonable Price : CLICK HERE FOR LINK