భారత్‌పై 25 శాతం టారిఫ్ వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. దీనిపై భారత్ స్పందించింది. ట్రంప్ ప్రకటించిన ట్యాక్సుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్టడీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
‘‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. టారిఫ్స్ ప్రభావంపై స్టడీ చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల లాగే, ఈ విషయంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్ మిత్రదేశమే అయినా.. ట్యాక్సులు ఎక్కువగా ఉన్నందున వాళ్ళతో పరిమిత స్థాయిలోనే బిజినెస్ చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కువ టారిఫ్స్ విధించే దేశాల్లో భారత్ ఒకటి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొంటోంది. అందుకే 25 శాతం ట్యాక్సులు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి’’ అని ‘ట్రూత్ సోషల్’ లో ట్రంప్ ప్రకటించారు.
Read also : యూట్యూబ్ డైట్ ప్లాన్స్ ఫాలో అయితే ప్రాణాలు పోతాయ్ !
Read also : ఆపరేషన్ సింధూర్ ఆపాలని ఏ లీడర్ చెప్పలేదు: మోడీ