రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్
: బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్ తో అదరగట్టింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్’ పేరుతో లాంచ్ అయింది. కేవలం రూ.1కే 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
రూ.1కే 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ ఆఫర్ కోసం దగ్గర్లోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)కు లేదా రిటైలర్ ను సంప్రదించవచ్చు. 4జీ సర్వీసులను విస్తరిస్తూనే కొత్త కస్టమర్లను ఆకట్టుకోడానికి బీఎస్ఎన్ఎల్ ఈ 1 రూపీ ప్లాన్ ప్రవేశపెట్టింది.