రాజాసింగ్ ఎన్‌కౌంటర్ కి స్కెచ్ !

Latest Posts Top Stories

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై గతంలో కొద్దిలో మిస్ అయిన ఎన్‌కౌంటర్ గురించి ఆయనే స్వయంగా చెప్పిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఎన్‌కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజాసింగ్ బాంబు పేల్చారు. ఆయన హిందువాహినిలో చేరి యువతను ధర్మం వైపు నడిపించే కార్యక్రమాలు చేస్తుండేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్లినా 144 సెక్షన్ పెట్టి, తన ప్రోగ్రామ్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని రాజాసింగ్ ఆరోపించారు. ఎవరైనా హిందువులను మతం మార్చేందుకు ప్రయత్నిస్తే వెంటనే తాము వెళ్ళి అడ్డుకునేవాళ్లమని, దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష గట్టిందని చెప్పారు. లేనిపోని కేసులు పెట్టి, జైలుకు పంపినా, బయటకు వచ్చిన వెంటనే మళ్లీ ధర్మం కోసం పనిచేశామని రాజాసింగ్ తెలిపారు.

ఇక అసలు ఎన్‌కౌంటర్ డ్రామా గురించి చెప్తూ, రాజాసింగ్ “కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను, నాతో పాటు మరో హిందువాహిని కార్యకర్తను ఎన్‌కౌంటర్ చేయడానికి భారీ ప్లాన్ వేసింది. నన్ను అడవిలోకి తీసుకెళ్లారు. ఆ ఆపరేషన్‌కు బాధ్యత వహించిన పోలీస్ ఆఫీసర్ హిందువే. కానీ, ఆయనకు నా గురించి ఏమీ తెలియదు. ఉన్నతాధికారులు కేవలం ‘ఎన్‌కౌంటర్ చేయాల్సిందే’ అని ఆర్డర్ ఇచ్చారు. ఆ పోలీసు నన్ను జీపు నుంచి దింపి, ‘పరిగెత్తమని’ చెప్పి, తన గన్ లోడ్ చేసుకుంటున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, నన్ను కాల్చబోతున్నారని.”

“నేను వెంటనే ఆ ఆఫీసర్‌తో, ‘సార్, ఉరకడం ఎందుకు? ఇక్కడే కాల్చేయండి. ధర్మం కోసం చస్తాం, ఇదే మా కల’ అని చెప్పా. నా మాటలు విని ఆ ఆఫీసర్ షాక్ అయ్యాడు. ‘ఏంటి ధర్మం గురించి మాట్లాడుతున్నారేంటి?’ అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆయన, ‘మీరు ఎవరు?’ అని అడిగాడు. దాదాపు రెండు గంటల పాటు మేం మా కార్యక్రమాలను చెప్పాం. హిందువాహిని, మా పోరాటం గురించి వివరించాం. అప్పుడు ఆ ఆఫీసర్‌కు అర్థమైంది, ‘మిమ్మల్ని చంపి ఉంటే నాకు పెద్ద పాపం తగిలేది’ అని ఫీలయ్యాడు.”

ఇక అక్కడ నుంచి ట్విస్ట్ ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసరే కొన్ని టీవీ ఛానెళ్లకు “రాజాసింగ్‌ను ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు” అని లీక్ చేశారట. ఈ వార్త మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎన్‌కౌంటర్ ఆర్డర్ ఇచ్చిన ఉన్నతాధికారులే భయపడి, “ఆపేయ్, ఆపేయ్” అని ఆ ఆఫీసర్‌కు ఫోన్ చేశారట. అలా రాజాసింగ్, తన సహచరుడు ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నారని సంచలన విషయాలు బయటపెట్టారు.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also: బనకచర్ల కట్టి తీరుతాం – ఎలా కడతావో చూస్తాం

Read also : యువత ఓట్లకు బీఆర్ఎస్ గాలం : మనసు మార్చుకున్న కేసీఆర్

Read also : గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్

 

Tagged

Leave a Reply