ఈమధ్య కాలంలో 20-30 ఏళ్ల యువతలో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉన్న యువకులు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్‌లో షటిల్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలడం, అమెరికాలో బోటింగ్ సమయంలో మరో యువకుడు గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వారిలో కనిపించే గుండె జబ్బులు, ఇప్పుడు యువతలోనూ సర్వసాధారణమవుతున్నాయని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండెపోటుకు కారణాలు
యువతలో గుండెపోటు ప్రమాదం జన్యుపరమైన గుండె సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు, అధిక శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల పెరుగుతోంది. అధిక కొవ్వు, జంక్ ఫుడ్, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం లాంటివి రక్తనాళాల్లో అడ్డంకులు, కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. డయాబెటీస్, బీపీ కూడా గుండె కండరాలను దెబ్బతీస్తాయి. కొవిడ్ వైరస్ వల్ల గుండె కండరాల వాపు (మయోసైటిస్) కూడా హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం కోసం ఆహార నియమాలు
పండ్లు, కూరగాయలు: రోజూ పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
లో ఫ్యాట్ ఫుడ్ : చేపలు, తక్కువ కొవ్వు ఉన్న చికెన్, తృణధాన్యాలు గుండెకు మేలు చేస్తాయి.
జంక్ ఫుడ్‌కు దూరం: అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించాలి.
ధూమపానం, మద్యం నివారణ: ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
తగిన నీరు: రోజూ తగినంత నీరు తాగడం రక్తపోటు, కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలి?
నిత్యం వ్యాయామం: రోజూ 30-45 నిమిషాలు నడక, యోగా, లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. అధిక శారీరక శ్రమ నుంచి దూరంగా ఉండాలి.
రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు: 25 ఏళ్లు దాటిన వారు గుండె ఆరోగ్యాన్ని తెలిపే బీపీ, చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి.
ఒత్తిడి నియంత్రణ: మెడిటేషన్, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ : గుండెపోటు లక్షణాలు (ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం) కనిపిస్తే, తొలి గంటలో (గోల్డెన్ అవర్) సీపీఆర్, ఆస్పత్రి చికిత్సతో ప్రాణాలను కాపాడుకోవచ్చు.]
గుండె ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించి, జీవనశైలిని మార్చుకుంటే యువతలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అందువల్ల ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోండి
ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Read also : TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE
Read also : అతినిద్ర కూడా అనర్థమే! 7-9 గంటల నిద్రతో ఆరోగ్యం
Read also : అమెరికా వద్దంటే మన టెకీల ఫ్యూచర్ ఏంటి ?